Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Dec-2017 11:12:48
facebook Twitter Googleplus
Photo

ఒక నిర్మాత మీద ఆమె ఫైర్ అయిందని.. ఓ సినిమా ఒప్పించే విషయంలో ఆ నిర్మాత రకుల్ మీద మరీ ఒత్తిడి తేవడంతో ఆమె సహనం కోల్పోయి ఆ ఫ్రస్టేషన్ అంతా నిర్మాత మీద చూపించిందని గుసగుసలు వినిపించాయి. ఈ విషయం వాస్తవమే అంటూ రకుల్ ప్రీత్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అసలు తాను ఎందుకంత అసహనానికి గురి కావాల్సి వచ్చిందో ఆమె వివరించింది.

‘‘నాతో సినిమా చేస్తానంటూ ఒక నిర్మాత వచ్చారు. కథ కూడా పూర్తిగా చెప్పలేదు. అంతలోనే అడ్వాన్స్ ఇస్తాను.. అగ్రిమెంట్ చేసుకుందాం అంటూ ఒత్తిడి తెచ్చారు. కానీ కథ వినకుండా నేను సినిమా ఎలా ఒప్పుకుంటాను? అదే విషయం చెప్పాను. అయినా వినకుండా నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు. దీంతో సహనం కోల్పోయి అరిచాను. తర్వాత సారీ చెప్పాను. ఇప్పటి వరకు నేను ఏ నిర్మాతతోనూ అలా ప్రవర్తించింది లేదు. దీంతో అది ఇండస్ట్రీలో పెద్ద ఇష్యూ అయిపోయింది. తర్వాత మంచి కథతో రండి.. సినిమా చేస్తానని ఆ నిర్మాతకు సర్దిచెప్పి పంపించాను’’ అని రకుల్ అంది.

ఇక తన పారితోషకం గురించి మీడియాలో వచ్చే వార్తల గురించి రకుల్ స్పందిస్తూ.. తానేదో కోట్లు కోట్లు పుచ్చుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటివి వింటే నవ్వొస్తుందని.. అలాగే బాధేస్తుందని.. తనకు ఎంత ఇస్తున్నారు ఏంటన్నది నిర్మాతలకు.. తనకు తెలుసని.. ఇలాంటి విషయాల్లో మిగతా వాళ్లు ఎందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తారో అర్థం కాదని ఆమె అంది

,  ,  ,  ,