Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Nov-2016 11:18:13
facebook Twitter Googleplus
Photo

మెగా అభిమానులకు శుభవార్త మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు అరుదైన పురస్కారం దక్కింది. నిన్న సాయంత్రం యుఏఈ లోని షార్జా స్టేడియంలో జరిగిన ఆసియా విజన్ 2016 వేడుకల్లో రామ్ చరణ్ ఈ పురస్కారం అందుకున్నారు. యంగ్ జనరేషన్ కు స్ఫూర్తినిచ్చే వ్యక్తులకు ఈ పురస్కారాలను అందజేస్తారు. అందులో భాగంగానే సౌత్ ఇండియా హీరోల నుండి రామ్ చరణ్ ను ఎంపిక చేశారు నిర్వాహకులు. గత ఆదివారం ఈ అవార్డులను ప్రకటించారు. సినిమా రంగంలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలు అందుకున్నవారికి ఈ అవార్డును బహుకరిస్తారు.
2006 నుండి ఈ అవ్రాదుల ప్రదానోత్సవం జరుగుతోంది. దుబాయ్ లో జరిగే అతిపెద్ద మలయాళం అవార్డుల ప్రధానోత్సవం ఇదే కావడం విశేషం. ఈ వేడుకకు రామ్ చరణ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులను ధరించి హాజరై అవార్డును అందుకుని అభిమానవులకు, నిర్వాహకులు సృతజ్ఞతలు తెలిపాడు. ఇకపోతే చరణ్ నటించిన ధృవ చిత్రం డిసెంబర్ 2న విడుదలకానుంది.

,  ,  ,  ,  ,  ,  ,