Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Nov-2016 11:43:09
facebook Twitter Googleplus
Photo

మెగాహీరో వరుణ్ తేజ్ సినిమా షూటింగ్ లో జరిగిన చిన్నపాటి ప్రమాదం కారణంగా ఆయన కాలికి గాయమైంది. మొదట అందరూ చిన్న గాయమే అన్నప్పటికీ ఇప్పుడు అది పెద్దదే అని తెలుస్తోంది. ఇప్పటికే కొన్నాళ్లుగా వరుణ్ తేజ్ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ మధ్య జరిగిన దీపావళి సందర్బంగా తీసుకున్న ఫ్యామిలీ ఫోటోలో పెద్ద కట్టుతో దర్శనమిచ్చాడు వరుణ్. ఆ కట్టు చూస్తే ఆయన కోలుకోవడానికి కాస్త ఎక్కువ టైమ్ పట్టేలా కనిపిస్తోంది. కనుక ఆయన సినిమాలు ముందుగా అనుకున్న సమయానికన్నా ఆలస్యమయ్యేలా ఉన్నాయని అంటున్నారు.
ఇప్పటికే ఆయన శ్రీవైట్ల డైరెక్షన్లో చేస్తున్న ?మిస్టర్?, శేఖర్ కమ్ముల డైరెక్క్షన్లో చేస్తున్న ?ఫిధా? రెండు చిత్రాల షూటింగ్ వాయిదా పడుతోంది. వరుణ్ తేజ్ ఖచ్చితంగా ఎప్పటికి కోలుకుంటాడో ఇంకా తెలీలేదు. దీంతో చేసేది లేక ఆ ఇద్దరు దర్శకులు వరుణ్ తేజ్ మినహా మిగిలిన నటీనటులపై ఉండే సన్నివేశాలను షూట్ చేసుకుని వరుణ్ కోసం రీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే వరుణ్ కూడా ఇప్పటికే రెండు సినిమాలు పెండింగ్ ఉండటంతో వేరే కొత్త సినిమాలకి ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వడం లేదని కూడా తెలుస్తోంది. మరి వరుణ్ తేజ్ త్వరగా కోలుకుని సినిమాలను త్వరగా పూర్తిచేయాలని కోరుకుందాం

,  ,  ,  ,