Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Aug-2016 11:10:56
facebook Twitter Googleplus
Photo

యుద్ధంలో శత్రువు నేరుగా వస్తే... ధైర్యంగా ఢీ కొనొచ్చు. దొంగ దెబ్బ తీయాలనుకుని, వెంటాడే నీడలా వస్తే.. మట్టుపెట్టడానికి కష్టపడాలి. తెలివితేటలు ఉపయోగించాల్సి వస్తుంది. ఆ ఐఫీఎస్ ఆఫీసర్ అలాంటోడే. గుండె నిండా ధైర్యం, బుర్ర నిండా తెలివితేటలతో శత్రువు ఎంతటి బలవంతుడైనా అంతం చేస్తాడు. ఇలాంటి పవర్‌ఫుల్ రోల్‌లో రామ్‌చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ?ధృవ?. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

దసరా కానుకగా అక్టోబర్ 7న సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ - ??పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన లుక్, బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నారు. చరణ్ నటనతో పాటు విలన్‌గా అరవింద్ స్వామి నటన సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది.

ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభించింది?? అన్నారు. సెప్టెంబర్‌లో టాకీతో పాటు సాంగ్స్ చిత్రీకరణ కూడా పూర్తవుతుంది అని అల్లు అరవింద్ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: నవీన్ నూలి, కెమేరా: పీఎస్ వినోద్, మ్యూజిక్: హిప్‌హాప్ ఆది, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.వై.ప్రవీణ్ కుమార్.

,  ,  ,  ,  ,  ,