Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Aug-2016 12:50:22
facebook Twitter Googleplus
Photo

ఇవాళ ఉప్పూ, పప్పూ, పాలు.. అన్నీ కల్తీ అవుతున్నాయ్. చివరకు ప్రేమ కూడా అలానే ఉంది. స్వార్థపు ప్రేమలు ఎక్కువైపోతున్నాయ్. అలాంటి ప్రేమలు ఎక్కువ కాలం సాగే ప్రసక్తే లేదంటున్నారు కాజల్ అగర్వాల్. సౌత్, నార్త్ అంటూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కాజల్‌కి ప్రేమలో పడే తీరిక చిక్కడంలేదట. ప్రొఫెషనల్‌గా దూసుకెళ్లడం సరే పర్సనల్‌గా కూడా స్థిరపడాలి కదా? అని కాజల్‌తో అంటే.. ??నిజమే. నాకూ ఆ ఆలోచన ఉంది. అయితే మనసుకి నచ్చిన వ్యక్తి దొరకాలి కదా?? అన్నారు. ఒకవేళ ప్రేమలో పడితే వీలైనంత ఎక్కువ టైమ్ లవర్‌కే ఇచ్చేస్తానంటున్నారామె.

ఇంకా కాజల్ మాట్లాడుతూ - ??లవ్ అనేది చాలా అపూర్వమైనది. ఒక వ్యక్తితో రిలేషన్‌షిప్ మొదలుపెడితే సిన్సియర్‌గా ఉండాలి. ఆ అనుబంధాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. అప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుంది. కొంత మందిని చూస్తే నాకు నవ్వొస్తుంది. మొక్కుబడిగా ఉంటారు. ముఖ్యంగా యూత్‌ని చూస్తే జాలేస్తోంది. లవ్‌ని చాలా చిన్న విషయంలా భావిస్తున్నారు. గాఢంగా ప్రేమించుకుంటారు. కొన్నాళ్ల తర్వాత ?ఈ వ్యక్తితో మనకు కుదరదు? అనిపిస్తే విడిపోతున్నారు.

అంతే తప్ప ఆ అనుబంధాన్ని నిలబెట్టు కునేంత ఓపిక ఉండటంలేదు. ప్రేమ విలువ తెలియక పోవడంవల్లే అలా చేస్తున్నారు. నేను మాత్రం ప్రేమలో పడితే అలా చేయను?? అని చెప్పారు. లవర్ లేడనే బాధ ఎప్పుడూ కలగలేదా? అనే ప్రశ్న కాజల్ ముందుంచితే - ??నా ఫ్రెండ్స్‌తో టూర్ వెళ్లినప్పుడు బాధ అనిపిస్తుంది. వాళ్లకు లవర్స్ ఉన్నారు. నేనేమో సింగిల్. అప్పుడు మాత్రం మనకూ ఒకరుంటే బాగుండేది కదా అనిపిస్తుంది?? అని చెప్పారు

,  ,  ,  ,  ,