Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Dec-2017 16:21:14
facebook Twitter Googleplus
Photo

విజయం కోసం ఎదురుచూస్తున్న స్టార్ హీరోల్లో ప్రస్తుతం అఖిల్ ఉన్నాడని అందరికి తెలిసిందే. ఎలాగైనా ఈ సారి బాక్స్ ఆఫీస్ వద్ద ఒక హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో గాని చిత్ర యూనిట్ మాత్రం ప్రస్తుతం చాలా టెన్షన్ గా ఉంది. సినిమాకు హైప్ మాత్రం బాగానే క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆడియో వేడుకను భారీ స్థాయిలో చేశారు. అఖిల్ - రానా కలిసి అమెరికాలో స్టేజ్ షోలతో హైప్ క్రియేట్ చేశారు.

అయితే ఇతర హీరోల సపోర్ట్ ని కూడా ఇప్పుడు అఖిల్ కు చాలా అవసరమని స్టార్ హీరోలను నాగ్ రంగంలోకి దింపుతున్నాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని స్పెషల్ గెస్ట్ గా ఈ రోజు జరగబోయే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కి ఆహ్వానించారు. అయితే అఖిల్ కూడా తన సైడ్ నుంచి ఇతర హీరోలను లాగే ప్రయత్నం చేస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హలో ప్రీ రిలీజ్ వేడుకకి రాబోతున్నట్లు చెప్పేశాడు. దీంతో మెగా అభిమానులు ఇప్పుడు హలో సినిమా వైపు చూస్తున్నారు.

అసలే అక్కినేని అభిమానులు సినిమాను చూడాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మెగా అభిమానుల దృష్టిని కూడా ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ హలో సినిమా కోసం వారి వైపు తిప్పుకునేలా చేసింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం ఉంది. అఖిల్ ఎలాగైనా మొదటి హిట్ అందుకోవాలని నాగ్ ఎలాంటి అవకాశాన్ని వదలడం లేదు.

,  ,  ,  ,  ,  ,