Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Sep-2017 10:43:30
facebook Twitter Googleplus
Photo

తన కోసం ఓ కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం భారీ బడ్జెట్ తో ఓ పోష్ హౌస్ నిర్మాణం చేయబోతున్నాడు. మెగా పవర్ స్టార్ తలచుకుంటే.. బడ్జెట్ కి పరిమితులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కదా. అందుకే సింపుల్ గా హౌస్ కట్టుకుంటూనే.. అందులోనే అన్ని వసతులు సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ ఇంటి కోసం రామ్ చరణ్ కేటాయించిన బడ్జెట్ 40 కోట్ల రూపాయలు అంటే షాక్ తినేయక తప్పదు.

నిర్మాణం దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటున్నారు. మోడలింగ్.. ఇంటీరియర్స్ కోసం ఎక్కవగా ఖర్చు చేస్తున్నారని టాక్. హైద్రాబాద్ లో ఇప్పటివరకూ ఉన్న పోష్ హౌస్ లలో ఇదో బెంచ్ మార్క్ గా నిలిచే అవకాశం ఉందట. విశాలమైన స్విమ్మింగ్ పూల్ తో పాటు సకల వసతులు ఉండేలా ఓ అత్యాధునిక జిమ్ కూడా ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంటున్నారట. ఇందులో లేటెస్ట్ ఎక్విమెంట్ అంతా ఉంటుందని తెలుస్తోంది. స్వతహానే ఫిట్నెస్ విషయంలో చెర్రీ దంపతులు ఎంతో కేర్ తీసుకుంటారు. రీసెంట్ గా ధృవ చిత్రంలో సిక్స్ ప్యాక్ చూపించిన సంగతి కూడా తెలిసిందే. మరోవైపు ఫిట్నెస్ పై ఆన్లైన్ లో బోలెడన్ని క్లాసులు కూడా ఇచ్చేస్తుంటుంది ఉపాసన.

ఫిట్నెస్ లవర్స్ అందరూ సర్ ప్రైజ్ అయిపోయే రేంజ్ ల ఈ ఫిట్నెస్ ఎక్విప్ ఉంటుందట. అందుకోసం ఓ స్పెషల్ ట్రైనర్ ద్వారా అన్నిటినీ ఏర్పాటు చేసకుంటున్నారు. జూబ్లీ హిల్స్ లో నిర్మాణం కానున్న ఈ ఇంటికి.. చరణ్- ఉపాసనలు చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ ప్లానర్స్ నుంచి డిజైన్స్ ను తెప్పించుకుంటున్నారు.

,  ,  ,  ,  ,