Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Nov-2016 11:07:27
facebook Twitter Googleplus
Photo

డాడీ డ్యాన్సులు చూడవా చెర్రీ! రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ షూటింగ్ పూర్తయిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. కరెన్సీ సంక్షోభం కారణంగా రిలీజ్ డేట్ విషయంలో కాసిన్ని అనుమానాలు ఉన్నాయ్ కానీ.. ఫస్ట్ కాపీ చేతిలోకి తెచ్చుకునేందుకు చెర్రీ ఉత్సాహం చూపిస్తున్నాడు.

పైగా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాని చరణ్.. ప్రస్తుతం డబ్బింగ్ పూర్తి చేయడమే కాదు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడట. హీరో విలన్ మధ్య వచ్చే సీన్స్ ఎడిటింగ్ విషయంలో కూడా ఎడిటింగ్ ని కూడా పరిశీలిస్తున్నాడట చెర్రీ. అయితే.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి యూరోప్ షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఖైదీ నెంబర్ 150కి చెర్రీ ప్రొడ్యూసర్ అయినా.. తండ్రి చిరంజీవి చేసే డ్యాన్సులు చూడాలనే ఇంట్రెస్ట్ ఉన్నా.. ధృవ పనుల కారణంగానే స్లోవేనియా వెళ్లడం లేదట.

ఈ నెల 20వరకూ చిరు అండ్ టీం యూరోప్ లోనే ఉండనున్నా.. ప్రొడ్యూసర్ చెర్రీ వెళ్లడం మాత్రం సందేహమే అంటున్నారు. రామ్ చరణ్ కి తనలోని ఖైదీ నెంబర్ 150 ప్రొడ్యూసర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలో.. లేక ధృవ హీరోకి ప్రాధాన్యత ఇవ్వాలో అర్ధం కావడం లేదట. అయినా.. చిరు అక్కడున్నాక చెర్రీ ఎక్కుడున్నా నిశ్చింతగా ఉంటాడులే!

,  ,  ,  ,  ,