Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Oct-2016 13:08:50
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగచైతన్యకు ఇంకో నెల రోజుల్లో 30 ఏళ్లు వచ్చేస్తాయి. కానీ ?ప్రేమమ్? సినిమాలో వచ్చే ఫస్ట్ ఎపిసోడ్లో అతణ్ని చూస్తే షాకైపోతాం. తొలి సినిమా ?జోష్?లో మాదిరి టీనేజ్ కుర్రాడిలా కనిపించి షాకిచ్చాడు చైతూ. అందుకోసం బరువు తగ్గడంతో పాటు తన లుక్ ను చాలా మార్చుకున్నాడు చైతూ. సినిమా చూసిన వాళ్లలో చాలామంది చైతూ టీనేజ్ లుక్ గురించే తనను అడిగారని.. ఈ ఎపిసోడ్ ఎప్పుడు తీశారంటూ వాకబు చేశారని దర్శకుడు చందూ మొండేటి తెలిపాడు.

??మా ప్రేమమ్ సినిమాకు ఇంతటి విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమాలో చైతూ టీనేజ్ లుక్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ ఎపిసోడ్ ఐదేళ్ల ముందు తీసి.. ఇప్పుడు సినిమాకు యాడ్ చేశారా అని అడుగుతున్నారు. దీన్ని బట్టి చైతూ ఎంత కష్టపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. సినిమాకు సంబంధించి ఇది బెస్ట్ కాంప్లెమెంట్ అనుకుంటున్నాను. ఈ సినిమాలో నటించి తోడ్పాటు అందించిన నాగార్జున.. వెంకటేష్ గార్లకు థ్యాంక్స్?? అని ?ప్రేమమ్? సక్సెస్ మీట్లో చందూ తెలిపాడు.

ప్రేమమ్ సినిమా 10 రోజుల్లోనే రూ.21 కోట్ల షేర్ సాధించిందని.. మూడో వారంలో కూడా థియేటర్లు యాడ్ చేస్తున్నామని.. మలయాళ ?ప్రేమమ్? బ్లాక్ బస్టర్ హిట్టయిన కేరళలోనూ తెలుగు ?ప్రేమమ్?ను రిలీజ్ చేయగా.. అక్కడ కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోందని ఈ చిత్ర సమర్పకుడు పి.డి.ప్రసాద్ తెలిపాడు.

,  ,  ,  ,  ,