Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Nov-2016 10:22:40
facebook Twitter Googleplus
Photo

తన ఫ్యామిలీలో ఆల్రెడీ గీతా ఆర్ట్స్.. అంజనా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బేనర్లున్నా.. తన తండ్రి రీఎంట్రీ మూవీ కోసం సొంతంగా కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్ పెట్టి నిర్మాతగా మారాడు రామ్ చరణ్. మరి ఈ బేనర్ ఆ తర్వాత ఏం చేస్తుంది.. ఎవరితో సినిమాలు తీస్తుంది.. అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఐతే రామ్ చరణ్ ఆ తర్వాత కూడా సినిమాలు నిర్మిస్తాడని సమాచారం. అతను బయటి హీరోలతో సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తుండటం విశేషం. హీరోలు బయటి వాళ్లే కానీ.. అతడికి చాలా దగ్గరి వాళ్లే. తన చిన్ననాటి స్నేహితులైన శర్వానంద్.. అక్కినేని అఖిల్ లతో సినిమాలు తీయబోతున్నాడట రామ్ చరణ్.

శర్వానంద్ తో రామ్ చరణ్ స్నేహం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత కూడా స్నేహితులుగా కొనసాగుతున్నారు. అతడితో కొణిదెల ప్రొడక్షన్స్ రెండో సినిమా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ?శతమానం భవతి?తో పాటు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ప్రొడక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు శర్వా. ఆ తర్వాత అతను చేసే చిత్రం రామ్ చరణ్ ప్రొడక్షన్లోనే అని అంటున్నారు. ఈ సినిమా తక్కువ బడ్జెట్లో రూపొందుతుందట. ప్రస్తుతం సొంత బేనర్లో విక్రమ్ కుమార్ సినిమాను మొదలుపెట్టబోతున్న అఖిల్ కూడా రామ్ చరణ్ ప్రొడక్షన్లో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఈ ప్రాజెక్టుల గురించి త్వరలోనే అధికారిక సమాచారం వస్తుందట.

,  ,  ,  ,  ,  ,  ,