Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jun-2017 10:49:38
facebook Twitter Googleplus
Photo

ఒక వ్యక్తిని గట్టిగా కొడితే.. అతను కింద పడతాడేమో కాని.. క్రిందపడి ఓ రెండుసార్లు బౌన్స్ మాత్రం అవ్వడు. అయితే శ్రీమంతుడు.. జనతా గ్యారేజ్.. డిజె వంటి సినిమాలు చూస్తే.. దెబ్బతిన్న విలన్ కి్రందపడి పైకి ఎగిరి.. మళ్ళీ క్రిందపడి మళ్లీ పైకి ఎగరుతాడు. నిజానికి ఈ బౌన్స్ అంతా కూడా రోప్ వర్క్ అనే టెక్నాలజీతో చేస్తున్నారు. రోప్స్ తో జనాలను గాల్లోకి లేపేసి.. తరువాత విజువల్ ఎఫెక్ట్స్ సపోర్టుతో ఆ తాళ్ళను తొలగిస్తారు. ఆ విధంగా ఇప్పుడు ఫైట్లన్నీ డిఫరెంట్ గా తయారయ్యాయ్.

ఇప్పుడు ఈ టెక్నాలజీకి.. రామ్ చరణ్ సినిమాకు కనక్షన్ ఏంటంటే.. రంగస్థలం 1985 సినిమాను ఒక పక్కా గ్రామీణ వాతావరణంలోనే కాదు.. ఏకంగా 1985 బ్యాక్ డ్రాపులో తీస్తున్నారు. ఆ కాలంలో ఇలా బౌన్సింగులో చేయించే ఫైట్లే లేవు. మహా అయితే ఫైటర్లు గాల్లో పల్టీలు కొట్టేవారు. అందుకే ఇప్పుడు చరణ్ తో కూడా రోప్స్ తీసేసి అటువంటి గాల్లో గింగిరాలు కొట్టే ఫైట్లే చేయిస్తున్నాడట సుక్కూ. ఫైట్ మాష్టర్లు రామ్-లక్ష్మణ్ల పర్యవేక్షణలో రోప్ వర్క్ లేని ఫైట్లతో 1990లలో చిరంజీవి చేసిన ఫైట్ల తరహాలో సీన్లు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి చాన్నాళ్ళ తరువాత ఒక సినిమాలో రోప్ వర్క్ అవుట్ అయ్యిందనమాట.

ఇకపోతే ఈరోజు ఉదయం ఈ సినిమా సూటింగ్ స్పాట్ నుండి హీరోయిన్ సమంత ఒక ఫోటోను షేర్ చేసి.. సినిమా ఔట్పుట్ పై అంచనాలు పెంచేసింది.

,  ,  ,  ,  ,  ,