Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jul-2016 11:42:50
facebook Twitter Googleplus
Photo

మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడు మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా మొదలవుతుందా అని చాలాకాలంగా చూసిన ఎదురుచూపులకు తెరదించుతూ, ఈ మధ్యే ఆయన తన సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళిన విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకు టైటిల్ విషయమై ఇప్పటికే రకరకాల పేర్లు వినిపిస్తుండగా, ?కత్తిలాంటోడు? అనే టైటిల్ దాదాపుగా ఖరారైందని అభిమానులు కూడా అదే పేరును ఫాలో అవుతూ వస్తున్నారు.
కాగా తాజాగా చిరు తనయుడు రామ్ చరణ్, మెగాస్టార్ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదని, ఇప్పటివరకూ వినిపిస్తున్నవన్నీ ప్రచారాలే అని తేల్చి చెప్పారు. ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తోన్న చరణ్, త్వరలోనే టైటిల్ ప్రకటిస్తామని, షూటింగ్ చాలా బాగా జరుగుతుందని తెలిపారు. కొద్దిసేపటి క్రితం ఫేస్‌బుక్‌లో అభిమానులతో ఓ వీడియో చాట్ నిర్వహించిన చరణ్, ఈ సందర్భంగానే చిరు సినిమా గురించి మాట్లాడారు. తమిళంలో ఘన విజయం సాధించిన ?కత్తి?కి రీమేక్‌ అయిన చిరు 150వ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

,  ,  ,  ,  ,  ,