Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2015 10:23:55
facebook Twitter Googleplus
Photo

మెగా హీరో రామ్ చరణ్ త్వరలో రకుల్ ప్రీత్ సింగ్ తో కలసి డ్యాన్స్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి సంబంధించిన తదుపరి షెడ్యూలు షూటింగ్ ఈ నెల 15 నుంచి యూరప్ కంట్రీస్ లో జరగనుంది. అక్కడ సన్నివేశాలతో పాటు, ఓ పాటను కూడా చరణ్, రకుల్ జంటపై చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పాటను సంగీత దర్శకుడు తమన్ ఇప్పటికే రెడీ చేశాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ స్టంట్ మాస్టర్ గా నటిస్తున్నాడు. ఇందుకోసం థాయిలాండు వెళ్లి ప్రత్యేకంగా కొన్ని రకాల స్టంట్స్ నేర్చుకుని వచ్చిన సంగతి విదితమే!

,  ,  ,  ,  ,  ,