Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Oct-2017 12:01:19
facebook Twitter Googleplus
Photo

రజనీకాంత్ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకే టైంలో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఎప్పుడూ ఒకదాని తర్వాత ఒకటి ఆచితూచి చేస్తుంటాడు. అలాంటిది ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 2.0 మూవీ కంప్లీట్ అవక ముందే కబాలి సినిమా తీసిన పా. రంజిత్ దర్శకత్వంలో మరోసినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో 70ల నాటి ముంబయి మాఫియా బ్యాక్ డ్రాప్ లో కాలా షూటింగ్ స్టార్ట్ చేశారు.

శంకర్ 2.0 మూవీ ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంటంతో ఆ సినిమా షూటింగ్ అనుకున్న దానికన్నా లేటయింది. మూవీ ఆడియో ను కొద్ది రోజుల క్రితమే దుబాయ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా జనవరికి థియేటర్లకు వస్తుందని నిన్న మొన్నటి దాకా చెబుతూ వచ్చారు. ఇప్పుడేమో వాయిదా పడిందని మాటలు వస్తున్నాయి. 2.0 యూనిట్ వాటిని ఖండించడం గానీ.. లేదా ఎప్పుడొస్తుందో చెప్పడం గానీ చేయడం లేదు. అనుకున్న దానిప్రకారమైతే కాలా సంక్రాంతి టైంకి థియేటర్లకు రావాల్సి ఉంది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆ సమయానికి వచ్చే పరిస్థితి లేదు. ఈ మేరకు కాలా చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. కాలా డిలే అవుతుందని తేల్చి చెప్పింది.

కాలా సినిమా బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ తొలిసారి సౌత్ లో అడుగు పెట్టబోతోంది. అయితే ఈ సినిమాలో రజనీ భార్య పాత్రలో నటిస్తోంది మాత్రం సీరియల్ అండ్ సినిమా నటి ఈశ్వరరావు. బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,