Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-May-2016 14:51:42
facebook Twitter Googleplus
Photo

?బ్రూస్ లీ? తీవ్రంగా నిరాశ పరచడంతో ఈసారి ఓ ప్రూవ్డ్ స్టోరీని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు రామ్ చరణ్. అందుకే తమిళ బ్లాక్ బస్టర్ ?తనీ ఒరువన్? రీమేక్ కు ఓటేశాడు. ఇది రీమేకే అయినప్పటికీ స్క్రిప్టు విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా చాలా టైమిచ్చి.. పక్కాగా రెడీ చేయించాడు చరణ్. వేరే కారణాలు కూడా తోడై.. ఈ సినిమా అనుకున్నదానికంటే ఆలస్యంగా మొదలైంది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తయినప్పటికీ.. అందులో చరణ్ నటించిన సన్నివేశాలు పెద్దగా లేవు. ప్రస్తుతం తన తండ్రి రీఎంట్రీ మూవీ కోసం రెగ్యులర్ షూటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్న చరణ్... ఈ నెల రెండో వారం నుంచి తన సినిమా షూటింగులో పాల్గొనబోతున్నాడు.

ముందుగా అనుకున్న ప్రకారమైతే ?తనీ ఒరువన్? రీమేక్ ఆగస్టులో రిలీజవ్వాలి. కానీ షూటింగ్ లేటవడం.. పైగా ఆగస్టులో పోటీ ఉండటంతో చరణ్ ఇప్పుడు మనసు మార్చుకున్నాడట. మంచి సెలవలు సీజన్ చూసుకుని సినిమాను రిలీజ్ చేయాలని భావించి.. దసరాకు ఫిక్సయ్యాడట. ఆ సమయానికి మరే పెద్ద హీరో సినిమా రేసులో లేకపోవడంతో సోలోగా సెలవుల సీజన్ ను దున్నేద్దామని చరణ్ నిర్ణయించుకున్నాడు.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్ర పోషిస్తున్నాడు. మగధీర తర్వాత చరణ్ ?గీతా ఆర్ట్స్?లో నటిస్తున్న చిత్రమిది. చరణ్ నటిస్తున్న తొలి రీమేక్ ఈ సినిమానే కావడం విశేషం.

,  ,  ,  ,  ,  ,