Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jun-2016 16:07:57
facebook Twitter Googleplus
Photo

అఖిల్ క్లోజ్ సర్కిల్స్ లో అంతా?అఖిల్ కు ఎంగేజ్ మెంట్ అయ్యిందనుకుంటున్నారు. ఈ విషయం పబ్లిక్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయమై ఓ పాపులర్ ఆంగ్ల పత్రిక అఖిల్ తో మాట్లాడింది. అఖిల్ మాట్లాడుతూ.. ?నిజమే?నేనో అమ్మాయిని ప్రేమిస్తున్నాను, అయితే ఎంగేజ్ మెంట్ మాత్రం కాలేదు, కేవలం మా తల్లి తండ్రలుకు పరిచయం చేసాను? అని తేల్చి చెప్పేశారు అఖిల్. అఖిల్ మనసు దోచింది ఎవరో కాదట.. ఆ అమ్మాయి ఫ్యామిలీ ఫ్రెండేనట. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు?
అఖిల్ లవ్వాడుతున్నది నగరంలోని ఓ వ్యాపార వేత్త కుమార్తె అయిన శ్రేయ భూపాల్‌‌తోనట. న్యూయార్క్‌లో చదువుకున్న ఆమె డిజైనర్ పనిచేస్తున్నారు. మొత్తానికి అఖిల్ లవ్ స్టోరీ ఎలాంటి ట్విస్ట్ లేకుండానే సుఖాంతమవనుంది. ఇదిలా ఉంటే చైతూ, సమంతలు కూడా త్వరలో ముసుగులు తొలగించి అందరిమధ్యా ఒక్కటవ్వనున్నారట. వీరి ప్రేమకు కుటుంబం నుండి ఫుల్ సపోర్ట్ ఉందిట. తెలియవస్తున్న సమాచారం ప్రకారం నాగచైతన్య నటిస్తోన్న ?ప్రేమమ్? సినిమా పూర్తవగానే నిశ్చితార్థ వేడుక జరుగనుందిట.
అది సరే?అఖిల్ ప్రేమ కథకి నాగార్జున, అమల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే ఇచ్చేశారని చెప్తున్నారు.

,  ,  ,  ,  ,