Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Dec-2017 13:08:56
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ సతీమణి గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన బిజినెస్ వ్యవహారాలలో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆమె ప్రతి చిన్న సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు గడిపిన ఆనందాల్ని ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఉంటారు. రీసెంట్ గా 2017 GES సదస్సులో ఆమె పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఇవాంకా ట్రంప్ తో కూడా ఫొటోస్ దిగి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

అయితే రీసెంట్ గా ఈ మెగా కోడలు భర్త రామ్ చరణ్ తో కలిసి తిరుపతి వెళ్లారు. సోమవారం ఉదయం స్వామి వారి దర్శనం చేసుకున్నారు. వారితో పాటు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ఆమె భర్త కళ్యాణ్ కూడా వెళ్లారు. స్పైడర్ సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ ఎన్వీ.ప్రసాద్ కూడా వారితో ఉన్నారు. వారికోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఇక దర్శనం అనంతరం ట్విట్టర్ ద్వారా ఉపాసన ఈ విషయాన్ని తెలియజేశారు.

బాలాజీ బ్లెస్సింగ్స్ తో మా డే స్టార్ట్ అయ్యింది. అందరు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకున్నామని ఉపాసన ట్వీట్ చేశారు.ఇకపోతే రామ్ చరణ్ స్పెషల్ ఫొటోను కూడా ఉపాసన పోస్ట్ చేస్తూ అంభిమానులకు మంచి సప్రైజ్ ని ఇచ్చారు.

,  ,  ,  ,  ,  ,