Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Feb-2017 13:29:14
facebook Twitter Googleplus
Photo

ఈ నెల 17న తెలుగు.. తమిళ్.. హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం కోసం ప్రమోషన్స్ లో కొత్తగా ట్రై చేస్తున్నారని ఇప్పటికే చెప్పుకున్నాం. సినిమా తీయడం ఒక ఎత్తయితే.. దాన్ని ప్రచారం చేయడం మరొక ఎత్తు. చిన్న సినిమాగా మొదలుపెట్టాలని అనుకుని.. ఇప్పుడు ఇండియా మొత్తాన్ని ఎట్రాక్ట్ చేస్తున్న మూవీ ఘాజీ.

గతంలో నేవీ అధికారులు ఉపయోగించే కోడ్ భాషలతో ఓ పోస్టర్ రిలీజ్ చేసిన ఘాజీ యూనిట్.. అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు ఏకంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీని కూడా ఘాజీ ప్రమోషన్స్ లోకి తెచ్చేశారు. 1971లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ యుద్ధం ఆధారంగా ఘాజీ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. అప్పట్లో పాకిస్తాన్ పై యుద్ధంలో విజయం సాధించడంలో కీలక భాగమైన షిప్ క్రూ మెంబర్లతో కలిసి.. ఇందిరా గాంధీ ఓ ఫోటో దిగారు. ఇప్పుడు ఆ ఫోటోను ప్రింట్ చేస్తూ.. మరో మూడు రోజుల్లో ఘాజీ అంటూ ప్రచారం చేస్తోంది ఘాజీ యూనిట్.

మరోవైపు ఇంటర్వ్యూలు.. మేకింగ్ వీడియోలు కూడా వచ్చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ మూవీ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఈ పిక్చర్ ఉంటుందని చెబుతున్నాడు రానా. మరోవైపు 700 సీజీ షాట్స్ ఉండడం ఘాజీకి ప్రత్యేకంగా నిలవనుందని చెబుతున్నారు.

,  ,  ,  ,  ,