Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-May-2017 13:25:02
facebook Twitter Googleplus
Photo

రామ్ గోపాల్ వర్మకు అర్ధరాత్రి వేళ అదో లోకంలో ఉంటుంటాడు. అప్పుడు ఆయనకు చాలా ఐడియాలొస్తాయి. ఆ ఐడియాలతో సినిమాలు తీసేయడానికి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడూ కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తుంటాడు. కానీ తర్వాత వాటి గురించి మరిచిపోతుంటాడు. అలా ఆలోచనల దశలోనే ఆగిపోయిన వర్మ సినిమాలు ఎన్నెన్నో. ఐతే న్యూక్లియర్ ఈ కోవలోకి రాదనే అనుకున్నారంతా. ఎందుకంటే ఈ ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేసింది వర్మ కాదు. ఓ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ. రూ.340 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్రణాళిక వేసుకుందా సంస్థ.

వర్మ ట్రాక్ రికార్డు గురించి పట్టించుకోకుండా ఈ మెగా ప్రాజెక్టుకు ఆయన్నే దర్శకుడిగా ఎంచుకుని ఆశ్చర్యపరిచింది ఆ ప్రొడక్షన్ హౌజ్. ఐతే దీని గురించి అనౌన్స్ మెంట్ వచ్చి ఆరు నెలలు దాటుతోంది. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు పూర్తవుతుందో.. ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదు. ఫస్ట్ అనౌన్స్ మెంట్ తర్వాత వర్మ కూడా దీని గురించి ఎప్పుడూ ప్రస్తావించింది లేదు. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసే నాటికి.. ఇప్పటికి వర్మ స్థాయి మరింత పడిపోయింది. వీరప్పన్ హిందీ వెర్షన్ తో పాటు తెలుగులో వంగవీటి కూడా ఫ్లాపయ్యాయి. ఇక సర్కార్-3 సంగతేంటో తేలాల్సి ఉంది. అది కూడా ఫ్లాపైతే వర్మ మీద ఏ నమ్మకంతో రూ.340 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తారో చూడాలి.

,  ,  ,  ,