Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Sep-2017 10:33:47
facebook Twitter Googleplus
Photo

అన్న గురించి తమ్ముడు.. తమ్ముడి గురించి అన్నయ్య చెబుతుంటే.. వినేందుకు అభిమానులకు రెండు చెవులు సరిపోవేమో అనిపిస్తుంది. టాలీవుడ్ లో గతంలో కూడా ఇలాంటి బంధాలు ఉన్నా.. బైటకు కనిపించేవి కావు. కానీ ఇప్పుడు మాత్రం అన్నీ బయటకే చెప్పేస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ మూవీ జై లవకుశ రిలీజ్ సందర్భంగా.. ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లు ఒకరి గురించి మరొకరు చెబుతున్న మాటలు భలే ఆకట్టుకుంటున్నాయి. నిజానికి కొన్నేళ్ల క్రితం వరకూ వీరు కలిసి కనిపించే వారు కాదు.. ఒకరి గురించి ఒకరు మాట్లాడిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. కానీ ఇప్పుడు మాత్రం కళ్యాణ్ రామ్ నిర్మాతగా.. ఎన్టీఆర్ హీరోగా సినిమా తెరకెక్కేసింది. అసలు అన్నాదమ్ములం ఇద్దరం కలిసి నటించే యోచన కూడా ఉందని.. ఇద్దరు హీరోలు చెప్పడం విశేషం. తన తాత.. తండ్రి తరం నుంచి ఈ అనుబంధం గొప్పదనం తెలుసుకున్నామని చెబుతున్నారు నందమూరి వారసులు.

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా.. మెగాస్టార్ తో కలిసి పవర్ స్టార్ దిగిన ఫోటో సెన్సేషన్ అయిపోయింది. బ్యాక్ డ్రాప్ లో తన కొడుకుతో ఎలా ఉన్నారో.. తమ్ముడు పవన్ ను కూడా అలాగే ట్రీట్ చేస్తున్నారు మెగాస్టార్. ఇదే విషయాన్ని పలు మార్లు ఆన్ స్టేజ్ పై కూడా చెబుతుంటాడు పవన్. ఫ్యాన్స్ ఎదురుగా వీరు ఎమోషనల్ అయిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. రాజకీయంగా వీరు వేర్వేరు పార్టీల్లో.. వేర్వేరు భావజాలాలతో ఉన్నా.. కుటుంబ పరంగా మాత్రం ఎప్పుడూ కనెక్ట్ అయే ఉండడం విశేషం.

టాలీవుడ్ లో సందడి చేస్తున్న మరో హీరో బ్రదర్స్.. అక్కినేని నాగ చైతన్య.. అఖిల్. ఈ అక్కినేని కుర్రాళ్లు ఇద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు కూడా తక్కువగానే ఉంటాయి. కానీ ఈ మధ్య వీటి కౌంట్ పెరుగుతోంది. పైగా స్వతహాగా చైతు సిగ్గరి కావడం.. అఖిల్ కాస్త దూకుడు స్వభావం కలవాడు కావడంతో.. ఈ అన్నాదమ్ముల ఇద్దరి కాంబో భలేగా ఉంటుంది.

,  ,  ,  ,  ,