Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jul-2016 11:24:15
facebook Twitter Googleplus
Photo

ఎనర్జిటిక్ హీరో రామ్ వరుస ప్రాజెక్టు లతో బిజీ గా మారనున్నాడు. రామ్ ప్రస్తుతం ?కందిరీగ? దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను చేస్తున్నాడు. వరుస హిట్లు పటాస్,సుప్రీం లతో దూసుకు పోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి తో మరో చిత్రం చేయాల్సి ఉంది. ఈ రెండు చిత్రాలు పూర్తైన తరువాత కిషోర్ తిరుమల దర్శకత్వం లో ఓ చిత్రం రామ్ చేయనున్నాడు. ?నేను-శైలజ? రూపం లో రామ్ ను కిషోర్ తిరుమల వరుస పరాజయాల నుంచి గట్టెక్కించాడు.మరో వైపు రొమాంటిక్ ప్రేమ కథా చిత్రాల దర్శకుడు కరుణాకరన్ తో మరో చిత్రం చేయనున్నాడు. సంవత్సరమే ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కరుణాకరన్ ఇంతకు ముందు రామ్ తో ఎందుకంటే ప్రేమంట చిత్రాన్ని తీశారు. కరుణాకరన్ చిత్రం కంటే ముందు కిషోర్ తిరుమల చిత్రం సెట్స్ పై కి వెళ్లే అవకాశం ఉంది.

,  ,  ,  ,  ,