Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2016 12:15:09
facebook Twitter Googleplus
Photo

ఎనర్జిటిక్ హీరో రామ్ ఇప్పుడు అంత అగ్రెసివ్ గా సినిమాలు చేయడం లేదు. వరుసగా తెగ స్పీడ్ తో సినిమాలు చేసే ఈ యంగ్ హీరో.. దూకుడు బాగా తగ్గించాడు. చాలా సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటున్నాడు. ఈ ఏడాది జనవరి 1న నేను శైలజ.. వచ్చి సక్సెస్ సాధించగా.. నాలుగు నెలల తర్వాత కొత్త సినిమా పనుల్లో వేగం పెంచాడు.

ఉగాది పండక్కి రామ్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. కందిరీగ - రభస చిత్రాలను తెరకెక్కించిన సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రామ్ మరుసటి మూవీ ఉండనుంది. ఈ సినిమాను గతంలో దూకుడు - 1నేనొక్కడినే లాంటి భారీ చిత్రాలను తీసిన 14రీల్స్ నిర్మించనుంది. రామ్ - సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రానున్న చిత్రంలో.. ఇప్పుడు హీరోయిన్ ని ఫైనలైజ్ చేశారు. మిల్కీ బ్యూటీ తమన్నాతో రామ్ జట్టు కడుతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎందుకంటే ప్రేమంట.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

అయితే.. రామ్-సంతోష్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ కందిరీగ మాత్రం ఈ హీరో కెరీర్ లో ఒక బెస్ట్ మూవీ నిలిచింది. ప్రస్తుతం అభినేత్రి అనే మూవీలో లీడ్ రోల్ కు యాక్సెప్ట్ చేసిన తమన్నా.. ఒకేసారి రామ్ తో కూడా పిక్చర్ ను కంప్లీట్ చేయనుంది. జూన్ ప్రారంభం నుంచి వరుసగా షూటింగ్ చేసి.. దసరా నాటికి విడుదల చేయాలని యూనిట్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,