Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-May-2016 12:17:11
facebook Twitter Googleplus
Photo

లవ్ స్టోరీల విషయంలో ఒక్కో డైరెక్టర్ కి తమదైన స్పెషాలిటీ ఉంటుంది. తమిళుడైనా టాలీవుడ్ లోనే గుర్తింపు తెచ్చుకున్న కరుణాకరన్.. కొత్త తరహా లవ్ స్టోరీలను అందించడంలో దిట్ట. పవన్ కళ్యాణ్ తో తొలిప్రేమ సుమంత్ యువకుడు వెంకటేష్ తో వాసు బన్నీతో హ్యాపీ ప్రభాస్ తో డార్లింగ్.. ఇలా అనేక లవ్ స్టోరీలతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు ఈ దర్శకుడు.

ఓ రొమాంటిక్ డ్రామాని తీసేందుకు రెడీ అవుతున్న కరుణాకరన్.. గతంలోనే ఎనర్జిటిక్ హీరో రామ్ ని కలిశాడట. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ కూడా రెడీ అయిందని తెలుస్తోంది. ప్రాజెక్ట్ సెట్ అయితే.. రామ్ హోమ్ బ్యానర్ స్రవంతి మూవీస్ పైనే చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గతంలో రామ్ కరుణాకరన్ లు ఇద్దరూ కలిసి.. ఎందుకంటే ప్రేమంట చిత్రాన్ని చేశారు. ఆ మూవీ కమర్షియల్ సక్సెస్ కాకపోయినా.. ఎవరికీ బ్యాడ్ నేమ్ మాత్రం తేలేదు.

నేను శైలజ సక్సెస్ తర్వాత.. బాగా గ్యాప్ తీసుకుని సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో కందిరీగ సీక్వెల్ చేస్తున్న రామ్.. ఈ సినిమా షూటింగ్ ని జూన్ లో మొదలుపెట్టనున్నాడు. దీని తర్వాత ఈ ఎనర్జిటిక్ హీరో చేయబోయే మూవీ కరుణాకరన్ దర్శకత్వంలోనే ఉంటుందని అంటున్నారు. అయితే.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది.

,  ,  ,  ,  ,