Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Nov-2016 10:48:16
facebook Twitter Googleplus
Photo

ఐటమ్ సాంగ్ ల్లో నటించడం అనగానే మన హీరోయిన్ల ఎందుకో కాస్త ?తక్కువ? అనుకుంటారు! పెద్ద హీరో పిలిచాడనో పెద్ద బ్యానర్ లో అవకాశమనో.. ఈ తరహా వేర్వేరు ఒత్తిళ్లతో ఐటమ్ సాంగ్ లో నటించేందుకు హీరోయిన్లు ఒప్పుకోవాల్సి వస్తుంటుందని అంటారు! ఆ మధ్య కాజల్ కూడా ఇలానే చేసిందిగా! జనతా గ్యారేజ్ లో ఒక పాట చేసి.. తరువాత ఐటమ్ సాంగ్స్ ఇక చెయ్యనని ఫిక్స్ అయిపోయింది. అలాగని - పారితోషికం విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గరు సుమా! సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి ఎంత తీసుకుంటారో... ఐటమ్ సాంగ్ కి అంతకంటే కాస్త ఎక్కువే కావాలని డిమాండ్ చేసే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఒక్క పాటకు అంత సొమ్మా.. అని అడిగితే ఐటమ్ సాంగ్ చేయడం వల్ల కెరీర్ కి నష్టమనీ దాన్ని తగ్గించుకోవాలంటే రెమ్యునరేషన్ పెంచుకుంటే కవర్ అవుతుందని అభిప్రాయపడుతుంటారు! సరే ఈ హీరోయిన్ల కంటే దేశంలోనే టాప్ క్రేజున్న సన్నీలియోన్ తో ఒక పాట చేయిస్తే బాగుంటుందని చాలామంది నిర్మాతలు అనుకుంటారు. కానీ ఆమె ఇంకెంత అడుగుతుందో అని కనీసం ట్రై చెయ్యారు. ఒకసారి ట్రై చేసి చూస్తే కదా అసలు విషయం తెలిసేది!

ఫామ్ లో ఉన్న హీరోయిన్ కంటే సన్నీ లియోన్ తో ఐటమ్ సాంగ్ చేయించడం చాలా చీపు! చీపు అంటే వేరేలా కాదండోయ్.. ఫైనాన్షియల్ గానే! అవునండీ.. ఇంతకీ సన్నీ ఒక పాటకి ఎంత తీసుకుంటుందని అనుకుంటున్నారు..? కోటి పైనే ఊహిస్తాం కదా! కానే కాదు... జస్ట్ రూ. 40 లక్షలు మాత్రమేనట! డోంగ్రీ కా రాజా చిత్రంలో ఓ పాటలో నటించేందుకు ఆమె తీసుకున్న పారితోషికం అదేనట! సాంగ్స్ విషయంలో సన్నీ లియోన్ ఇంత రీజనబుల్ రేటు చెబుతుందని ఎవ్వరూ అనుకోరు! అందుకేనేమో ఇప్పుడు ఒకేసారి ఏకంగా 6 సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తోంది. డిమాండ్ ఉన్నప్పుడు రేటు పెంచుకోవడం మన హీరోయిన్లకు తెలిసిన ఎకనామిక్స్. కానీ క్రేజ్ ఉన్నప్పుడే కాస్త రేటు తగ్గించుకుని అవకాశాలు పెంచుకోవడం సన్నీకి బాగా వంటపట్టిన ఎకనామిక్స్ అని చెప్పాలి! ఏదైతేనేం నిర్మాతలకు ఇది శుభవార్తే కదా.

,  ,  ,  ,  ,