Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2017 15:44:51
facebook Twitter Googleplus
Photo

బాహుబలి సినిమాతో హీరో ప్రభాస్ - విలన్ రానాలు నేషనల్ లెవెల్ లో ఫేమస్ అయ్యారు. ఎక్కడకు వెళ్లినా వారి సొంత పేర్లతో పాటు బాహుబలి - భళ్లాలదేవుడి పేర్లతో సంబోధిస్తున్నారంటే వాళ్లిద్దరూ ఈ క్యారెక్టర్లను జనం ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్ధమైపోతుంది. ఐదేళ్లపాటు సాగిన బాహుబలి రెండు పార్టుల షూటింగ్ లో రానా ప్రభాస్ మంచి ఫ్రెండ్సయిపోయారు. వీళ్ల మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ విశేషాలు తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పటికప్పుడు ఉత్సుకత చూపిస్తూనే ఉన్నారు.

రానా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గానే ఉంటాడు. వీలున్నప్పుడల్లా విశేషాలు షేర్ చేయడంతో పాటు అభిమానులను ట్విట్టర్ ద్వారా పలకరిస్తుంటాడు. రీసెంట్ గా ఓ క్వశ్వన్ అండ్ ఆన్సర్ సెషన్ లో బాహుబలి ప్రభాస్ ను సోషల్ మీడియాలోకి ఎప్పుడు తీసుకొస్తారంటూ అభిమానులు భళ్లాలదేవుడు రానాను అడిగారు. దీనికి రానా సమాధానమిస్తూ ఈ విషయంలో తాను ప్రయత్నించాను కానీ కుదర్లేదంటూ ఒట్టేసి మరీ చెప్పాడు. ప్రభాస్ సోషల్ మీడియాలో లేనప్పటికీ అతడికి సంబంధించిన టీం ఫేస్ బుక్ లో ప్రభాస్ పేరిట పేజ్ మెయిన్ టెయిన్ చేస్తోంది. అయినా సరే అతడు ట్విట్టర్ లోకి రావాలంటూ ఫ్యాన్సంతా ఒత్తిడి పెంచుతున్నారు.

ప్రభాస్ మొదటి నుంచి కాస్త సిగ్గరి కావడంతో ఇలాంటి యాక్టివిటీస్ కు కాస్త దూరంగానే ఉన్నాడు. ఓపెన్ గా మాట్లాడాల్సి వచ్చినా.. బహిరంగ వేదికలపై మాట్లాడాల్సి వచ్చినా పొడిపొడి మాటలతోనే సరిపెడతాడు. కాబట్టి ట్విట్టర్ లోకి ప్రభాస్ రావాలన్న అభిమానుల కోరిక ఇప్పట్లో తీరకపోవచ్చు.

,  ,  ,  ,  ,