Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2016 13:00:08
facebook Twitter Googleplus
Photo

హీరోనే బాహుబలి అయినప్పుడు... ఆయన్ని ఎదిరించే విలన్ ఎలా ఉండాలి? అదిగాక రాజమౌళి సినిమా. రాజమౌళి సినిమాల్లో హీరోల్ని తలదన్నే రీతిలో విలన్ ఉంటాడు. తెరపై విలన్ ని చూస్తున్నప్పుడు... పాపం వీడు హీరోని ఏం చేస్తాడో అని ప్రేక్షకులకే వెన్నులో ఒణుకు పుడుతుంటుంది. అక్కడే హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తుంటాడు రాజమౌళి. అందుకే బాహుబలికి ఢీ కొట్టేందుకు రాజమౌళి అంతకు రెండింతలు బలంగా అనిపించేలా భల్లాలదేవ పాత్రని డిజైన్ చేశాడు. ఆ పాత్రని పోషించేందుకు రానాని ఎంచుకొన్నాడు. `బాహుబలి` చూడగానే రాజమౌళి లెక్కలు ఎంత కరెక్టో మరోసారి తెలిసొచ్చాయి.

అయితే బాహుబలి 2 కోసం రానా మరింత భీకరంగా మారాడు. తొలి చిత్రాన్ని మించిపోయేలా తన ఫిజిక్ ని మార్చుకొన్నాడు. కండలతో ఉక్కుబాడీని తయారు చేసుకొన్నాడు. ఆ రూపం చూస్తే రానా భల్లాల దేవ కాదు - కండల దేవ అనిపించకమానదు. ఇదిగో తన ఫిజికల్ ట్రైనర్ తో కలిసి ఉక్కుబాడీతో రానా ఎలా పోజిచ్చాడో చూడండి. ఈ కండలవీరుడిని ఢీ కొట్టేవాళ్లు తెలుగు ఇండస్ట్రీలోనే లేరు అనిపిస్తోంది కదూ

,  ,  ,  ,  ,