Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Apr-2016 11:46:08
facebook Twitter Googleplus
Photo

హీరోగా తన తొలి సినిమా ?లీడర్?లో రానా దగ్గుబాటి ఎలా ఉండేవాడో ఓసారి గుర్తు తెచ్చుకోండి. ఆ తర్వాత ?బాహుబలి? సినిమాలో భల్లాలదేవుడిగా అతడెలా ఉన్నాడో ఊహించుకుని చూడండి. తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదా. తొలి సినిమాలో అంత సాఫ్ట్ గా కనిపించిన రానా.. భల్లాలదేవ లాంటి క్రూర పాత్రను పోషిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. కానీ తనను తాను గొప్పగా మలుచుకుని.. తెరమీద సరికొత్తగా ఆవిష్కరించుకున్నాడు రానా. ఇలాంటి ప్యాక్స్ పెంచడం.. కండలు చూపించడం.. బాలీవుడ్ వాళ్లకే చెల్లు అనుకునేవాళ్లం ఒకప్పుడు. కానీ ?బాహుబలి?లో రానాను చూసి.. బాలీవుడ్ కండల వీరులు కూడా కుళ్లుకునే పరిస్థితి తలెత్తింది. ?బాహుబలి? తొలి భాగంలో మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్న రానా.. ఇప్పుడిక రెండో పార్ట్ కోసం సన్నద్ధమవుతూ బిజీగా గడుపుతున్నాడు.

రానా ఇప్పటికే బాహుబలి-2 షూటింగ్ లో పాల్గొంటున్నాడని చాలామంది అనుకున్నారు కానీ.. మన మాంచో విలన్ ఇంకా కసరత్తుల్లోనే మునిగి ఉన్నాడన్నది లేటెస్ట్ న్యూస్. ముంబయిలో ఓ స్పెషల్ ట్రైనర్ ను పెట్టుకుని కండలు పెంచే పనిలో బిజీగా ఉన్నాడు రానా. ఇక బాహుబలి-2 షూటింగుకి నేను రెడీ అన్నట్లు జిమ్ నుంచి ఫొటోలకు ఇచ్చిన పోజు చూస్తే వామ్మో ఏంటా అవతారం అనిపించడం ఖాయం. బాహుబలి-2లో రానా మరింత భారీగా.. క్రూరంగా కనిపించడం.. జనాల్ని భయపెట్టడం ఖాయమని ఈ ఫొటో చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం బాహుబలి టీం అంతా బ్రేక్ తీసుకుని వేసవి సెలవుల్ని ఎంజాయ్ చేస్తుంటే రానా మాత్రం ఇలా కష్టపడుతున్నాడు. జూన్ లో షూటింగ్ మొదలవగానే రానా మీదే కీలక సన్నివేశాలు తీస్తారని సమాచారం.

,  ,  ,  ,  ,