Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jan-2015 10:31:03
facebook Twitter Googleplus
Photo

దగ్గుబాటి రానా హిందీలో మళ్లీ స్పీడు పెంచాడు. గతంలో కొన్ని సినిమాలలో నటించి కాస్త బ్రేక్ తీసుకున్న ఈ టాల్ బాయ్, తన తెలుగు ప్రాజక్టులు పూర్తవడంతో మళ్లీ ముంబయ్ లో సందడి చేస్తున్నాడు. ఇప్పటికే అక్షయ్ కుమార్ తో కలసి 'బేబీ' చిత్రంలో నటించాడు. తాజాగా తన మాజీ స్నేహితురాలు బిపాషా బసుతో కలసి 'నయ్' సినిమా కోసం పనిచేస్తున్నాడు. గతంలో 'దమ్ మారో దమ్' సినిమా కోసం బిప్స్ తో కలసి రానా పనిచేయడం ... ఆ షూటింగులో ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరగడం ... తర్వాత మళ్లీ దూరం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ జంట 'నయ్' సినిమాలో నటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. "ఇదొక బ్యూటీఫుల్ మూవీ. మళ్లీ బిపాషాతో చేయడం హ్యాపీగా వుంది. దర్శకుడు విక్రం ఫడ్నిస్ దీనిని చాలా బాగా తీస్తున్నాడు" అంటున్నాడు రానా. ఏమైనా, మళ్లీ ఈ జంట మధ్య కొత్త స్నేహం చిగురించినట్టే కనిపిస్తోంది!

,  ,  ,  ,  ,