Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Feb-2017 16:25:07
facebook Twitter Googleplus
Photo

ఎందుకు చేస్తున్నారో తెలియదు కాని.. కొందరు ఆగంతకులు అదే పనిగా ఫుటేజ్ లీక్ చేయడంలో బిజీగా ఉంటారు. గతంలో మొత్తంగా పూర్తయిపోయిన అత్తారింటికి దారేది' సినిమా మొదటి హాఫ్ ను రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ ను ఇరకాటంలో పడేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా కాటమరాయుడుపై విరుచుకుపడ్డారు.

మ్యాటర్ ఏంటంటే.. పవన్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడుకు సంబంధించి క్లయమ్యాక్స్ ఫైట్ ఫుటేజ్ ను లీక్ చేశారు కొందరు దండగులు. ఇంకా పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ పూర్తవ్వని ఫుటేజ్ ఇప్పుడు బయటకొచ్చేసింది. ముందుగా ఒక గుడి సెట్ వేసి అక్కడ బ్లూ మ్యాట్ అండ్ గ్రీన్ మ్యాట్ ఎరేంజ్ చేసి సినిమా షూటింగ్ పూర్తి చేసి.. దానిని ఎడిటర్ ఆఫీసులో ఫైనల్ వర్షన్ లాక్ చేసి.. ఆ వర్షన్ ను విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు అప్పజెబుతారు. అలా అప్పజెప్పిన క్లయమ్యాక్స్ వర్షన్ ఇప్పుడు లీకైంది. ఇందులో పవన్ కళ్యాణ్ మరియు ఖైదీ నెం 150 ఫేం తరుణ్ అరోరా మధ్యన జరిగే ఫైట్ సన్నివేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా పూర్తవ్వని ఈ ఫుటేజ్ ఎలా లీకైనట్లు?

ఫుటేజ్ పై కోడింగ్ అలాగే ఏ విజువల్ ఎఫెక్ట్స్ ఏ కంపెనీకి ఇచ్చారు అనే విషయం గుర్తించడానికి ప్రత్యేకమైన నెంబరింగ్ కూడా ఉందట. దానితో ఎక్కడి నుండి లీకైందో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఆ విషయం తెలిసిన తరువాత పోలీసులు తమ పద్దతిలో విచారిస్తే ఎవరు లీక్ చేశారో ఇట్టే తెలిసిపోతుంది.

,  ,  ,  ,  ,  ,