Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Nov-2017 13:40:54
facebook Twitter Googleplus
Photo

హీరో లెవెల్ కి ఎదిగిన సునీల్ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నడో అందరికి తెలిసిందే. టాలెంట్ ఉన్న హీరోగా కనీసం ఒక నాలుగు హిట్స్ కూడా అందుకోలేకపోయాడు. కెరీర్ లో మర్యాద రామన్న తప్పితే సునీల్ కి హీరోగా గుర్తింపు తెచ్చిన చిత్రాలు అంతగా ఏమి లేవనే చెప్పాలి. ఉంగరాల రాంబాబు సినిమా తర్వాత సునీల్ కెరీర్ కొంచెం కష్టకాలంలోనే పడింది.

దీంతో మళ్లీ కమెడియన్ గా నటిస్తానని చెప్పాడు. దీంతో హీరోగా తీయాల్సినా సినిమాలు కూడా చాలావరకు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. అయితే రీసెంట్ గా సునీల్ కి ఎవరు ఊహించని విధంగా ఒక మంచి కథ దొరికింది. టాలీవుడ్ ప్రముఖ రచయిత రాజమౌళి తండ్రి కె. విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ లో ఒక సినిమాను సునీల్ చేయబోతున్నాడట. ఇటీవల విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథ సునీల్ కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సినిమాను నిర్మించేందుకు రెడీగా ఉందని టాక్.

ప్రస్తుతం సునీల్ మలయాళం సినిమాకు రీమేక్ వస్తోన్న 2 కంట్రీస్ సినిమాలో నటిస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక త్వరలోనే విజయేంద్రప్రసాద్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవ్వనుందని తెలుస్తోంది

,  ,  ,  ,  ,