Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-May-2017 14:57:02
facebook Twitter Googleplus
Photo

ఈ వారం కొత్తగా థియేటర్లలోకొచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లోనే టోటల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రొజెక్ట్ చేయడం... లీడ్ పెయిర్ నాగచైతన్య రకుల్ ప్రీత్ సింగ్ జంట బాగుండటం ఈ సినిమాకు ప్లస్ పాయింటయ్యాయి. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ఈ సినిమాకు బాగానే వస్తున్నారు.

సినిమా రిలీజైన శుక్రవారం నాగచైతన్య కెరీర్ లోనే హయ్యస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ సినిమాకు వచ్చాయి. శని ఆదివారాల్లో అడ్వాన్స్ బుకింగ్ లు పూర్తయ్యాయి. టోటల్ గా ఈ వీకెండ్ లో రారండోయ్ వేడుక చూద్దాంకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సోమవారం నుంచి కలెక్షన్లు స్టడీగా ఉంటే ఈ సినిమా డీసెంట్ హిట్ అవుతుంది. కిందటి వారం రిలీజైన నిఖిల్ హీరోగా నటించిన కేశవ వీకెండ్ లో మంచి వసూళ్లే రాబట్టినా వీక్ డేస్ లో బాగా వీక్ గా నడిచింది. ఈ శని ఆదివారాల్లో మంచి కలెక్షన్లు వస్తే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగొచ్చేస్తుంది. ఇక శర్వానంద్ హీరోగా నటించిన రాధ పూర్తిగా డల్ అయిపోయింది. కలెక్షన్లు అస్సలు లేవు. ఈ సినిమాను ఫ్లాప్ కేటగిరీలో లెక్క పెట్టేయొచ్చు.

విడుదలై నాలుగు వారాలైనా బాహబలికి ఇంకా కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. భారీ సినిమాలు ఏవీ విడుదల కాకపోవడం బాహుబలికి కలిసొస్తోంది.

,  ,  ,  ,  ,