ఒకవైపు హీరోగా ధృవ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150కి నిర్మాతగా బోలెడంత బాధ్యతను హ్యాండిల్ చేస్తున్నాడు రామ్ చరణ్. మరోవైపు తన తర్వాతి ప్రాజెక్టుకు కూడా సిద్ధమైపోతున్నట్లు మెగా పవర్ స్టార్ తనే చెప్పేస్తున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ హీరోగా తెరకెక్కే మూవీ.. ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. సుక్కు-చెర్రీల మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిపోతున్నాయి. ఇప్పుడీ ప్రాజెక్టులోకి మాజీ హీరోయిన్ రాశిని తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మూవీ రెండో సినిమాగా తెరకెక్కిన గోకులంలో సీత చిత్రంలో హీరోయిన్ గా నటించిన రాశి.. ఆ తర్వాత టాప్ రేంజ్ లో ఉన్నపుడే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. మళ్లీ పదేళ్లకుపైగా గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చిన రాశి.. కేరక్టర్ ఆర్టిస్ట్ గా చేసేందుకు సై అనేసింది.
బాబాయ్ పవర్ స్టార్ కు హీరోయిన్ గా నటించిన ఈ భామ.. అబ్బాయ్ మెగా పవర్ స్టార్ సినిమాలో ఎలాంటి కేరక్టర్ చేయనుందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే రాశితో అగ్రిమెంట్స్ లాంటివన్నీ కంప్లీట్ చేసేయడమే కాదు.. ఆమె కేరక్టర్ కి సంబంధించిన కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా పూర్తయిపోతోందిట. చెర్రీ నెక్ట్స్ ప్రాజెక్ట్ కి సంబంధించి దాదాపు ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు క్యాస్టింగ్ ను కూడా సూపర్ స్పీడ్ లో కంప్లీట్ చేసేస్తున్నాడు దర్శకుడు సుకుమార్.