Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Nov-2017 13:49:24
facebook Twitter Googleplus
Photo

వెంకటేష్ మరుసటి సినిమా ఎప్పుడు అనే అంశం చాలా నెలలుగా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. క్రిష్ తో సినిమా అనుకున్నారు.. అది ఆగిపోయింది. కిషోర్ తిరుమలతో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించారు. అది కూడా పట్టాలెక్కలేదు. పూరీ జగన్నాధ్ తో కూడా ఓ సినిమా అనుకున్నారు కానీ.. అది పట్టాలెక్కలేదు.

ఇప్పటికి దర్శకుడు తేజతో ఓ సినిమా ఖాయం చేసుకున్నారు. రీసెంట్ గా నేనే రాజు నేనే మంత్రితో మంచి సక్సెస్ ను అందుకున్న తేజ.. తన తర్వాతి సినిమాను వెంకీతోనే తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఇప్పుడీ మూవీ లాంఛింగ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. డిసెంబర్ 13న వెంకీ-తేజ మూవీని అధికారికంగా ప్రకటించబోతున్నారట. అదే డేట్ ను ఖాయం చేయడానికి కారణం.. ఆ రోజున విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు కావడమే.

గురు మూవీ తర్వాత 8 నెలల పాటు గ్యాప్ తీసుకున్న వెంకటేష్.. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడని తెలుస్తోంది. తన ఫిజిక్ లో కూడా స్వల్పంగా మార్పులు చేసుకున్నాడట. ఇప్పుడు తేజతో తెరకెక్కించే సినిమా.. యాక్షన్ డ్రామా జోనర్ లో ఉంటుందని తెలుస్తోంది.

,  ,  ,  ,