Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-May-2016 12:46:31
facebook Twitter Googleplus
Photo

పాపం రాజీవ్ కనకాల. కుర్చీకి అతుక్కుపోయిన అతణ్ని రష్మి గౌతమ్ చితకబాదేసింది. తన గోళ్లతో రక్కేసింది. కానీ అతను ఏం చేయలేడు పాపం. ??ఇదిగో చూడండి. రష్మి గౌతమ్ నన్నెలా రక్కేసిందో. ఈ అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించరా?? అంటూ ఫేస్ బుక్ లో పోస్టు కూడా పెట్టి తన గోడు వెళ్లబోసుకున్నాడతను. కానీ అతడి గోడు వినేవాళ్లు ఎవ్వరూ లేరు.

అయినా రాజీవ్ కనకాలను రష్మి ఇలా రక్కేయడమేంటి.. అంటే ?చారుశీల? సినిమా చూడమంటున్నాడు దర్శకుడు వి.శ్రీనివాసరెడ్డి. ఆ సినిమాలో ఓ కీలక సన్నివేశంలో రష్మి.. రాజీవ్ కనకాల మీద ఇలా పాశవికంగా దాడి చేస్తుందట. ఇప్పటిదాకా రష్మిని గ్లామరస్ రోల్స్ లోనే చూసిన ప్రేక్షకులు.. ఈ సినిమాలో ఆమెలోని వయొలెంట్ యాంగిల్ చూడొచ్చంటున్నారు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ?చారుశీల?లో రష్మి సైకో తరహా పాత్ర పోషిస్తోంది.

రష్మి టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో రాజీవ్ కనకాల.. రిషి.. బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజీవ్ కనకాల ఇందులో కుర్చీకే పరిమితమయ్యే పాత్ర పోషిస్తున్నాడు. అతడికి సేవలు చేస్తూ ప్రేమగా చూసుకునే రష్మి.. ఓ టైంలో సైకోలా మారిపోయి అతడి మీద దాడికి దిగుతుంది. చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంది. దానికి కారణమేంటో తెరమీదే చూసి తెలుసుకోవాలి. రష్మి ఓవైపు హాట్ హాట్ గా కనిపిస్తూనే మరోవైపు.. వయొలెంట్ అవతారంలో భయపెడుతోంది కూడా. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

,  ,  ,  ,  ,  ,