బెంగాల్ టైగర్ తరవాత రవితేజ సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. చక్రి అనే కొత్త దర్శకుడి కథకు ఓకే చెప్పినా.. దాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లే సాహసం చేయలేకపోయాడు రవితేజ. ఇప్పుడు బాబి కథకు ఓకే చెప్పేసినట్టు టాక్. వీరిద్దరి కాంబినేషన్లో ఇది వరకు పవర్సినిమా వచ్చింది. కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రెండో సినిమారాబోతోందన్నమాట.
మరోవైపు బాబి.. సర్దార్ ఫ్లాప్‌తో చప్పున చతికిలపడ్డాడు. బాబి సత్తా తెలిసిన రవితేజ.. బాబిని పిలిచి కథ చెప్పమన్నాడట. బాబి కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు టాక్. చుట్టాలబ్బాయ్ నిర్మించిన రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాత అని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా పై అధికారిక ప్రకటన రానుంది.