Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Apr-2016 11:42:04
facebook Twitter Googleplus
Photo

కొన్ని జంటలు తెరపై చూడ్డానికి భలే ఉంటాయి. వాళ్ల కోసమైనా సినిమాకి వెళదామనిపిస్తుంటుంది. తెరపై వాళ్లు ఏం చేసినా చేయకపోయినా కెమిస్ట్రీ మాత్రం భలే వర్కవుటవుతుంటుంది. ఆ తరహా జంటల్లో తమన్నా - కార్తీలది ఒకటి. వీళ్లిద్దరూ కలిసి ఇప్పటిదాకా మూడు చిత్రాల్లోనటించారు. ఈ జోడీ కలిసిన ప్రతిసారీ సూపర్ హిట్టే. ఆ విషయం ఊపిరితో మరోసారి కన్ఫమ్ అయ్యింది. మీ ఇద్దరి జోడీ ఎందుకలా కుదురుతుంటుందని అటు తమన్నాని అడిగినా ఇటు కార్తీని అడిగినా ``ఏంటో మాకే అర్థం కాదు కానీ మేమిద్దరం సెట్ లో గొడవ పడుతుంటాం తెలుసా! షటప్ యార్ అంటూ ఒకరిపై ఒకరు మాటలు విసురుకుంటుంటాం కూడా`` అని చెబుతుంటారు. మరి అలాంటి జోడీ తెరపై మాత్రం అదిరిపోతుంటుంది. అయినా గొడవలు పడేంత చనువుందంటే కెమిస్ట్రీ వర్కవుట్ అవక ఏమవుతుంది చెప్పండి! అదే అసలు రహస్యమన్నమాట.

అయితే మొన్నటిదాకా లక్కీ హీరో ఎవరంటే అలా ఏమీ ఉండదని చెప్పిన తమన్నా ఇప్పుడు మాత్రం నిస్సందేహంగా నా లక్కీ హీరో కార్తీనే అని చెప్పుకొచ్చింది. ఊపిరి సక్సెస్ మీట్ లో ఆమె బహిరంగంగా ఆ విషయం చెప్పింది. ఈ జోడీ కోసం మరోసారి ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూడాల్సిందే అన్నమాట. తమన్నా ఊపిరి సక్సెస్ మీట్ లో మనసు విప్పి మాట్లాడింది. ``ఇప్పటిదాకా నాకు పెద్ద విజయాలు చాలానే వచ్చాయి. కానీ వాటి సక్సెస్ ని పెద్దగా ఎంజాయ్ చేయలేదు. అయితే ఊపిరి సక్సెస్ మాత్రం చాలా ఎంజాయ్ మెంట్ ని ఇచ్చింది`` అని చెప్పుకొచ్చింది. ఈ టీమ్ నాకు చాలా స్పెషల్ అని కూడా ఆమె సెలవిచ్చింది. నాగార్జునతో కలిసి నటించడం ఎప్పటికీ మరిచిపోలేనని ఆయనో స్వీట్ పర్సన్ అని చెప్పింది.

,  ,  ,  ,  ,  ,  ,  ,