Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Apr-2016 11:19:15
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ తర్వాత.. దర్శకుడు బాబీ కనీసం ఎక్కడా కనిపించలేదు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ కు ఏ రేంజ్ లో గుర్తింపు వచ్చిందో.. ఆస్థాయిలో తనకు స్టార్ డైరెక్టర్ స్టేటస్ వస్తుందని ఆశించిన బాబీకి.. సర్దార్ నిరాశే మిగిల్చింది.

సర్దార్ ఫ్లాప్ అంశాన్ని అందరూ పవన్ మిస్టేక్ గానే పరిగణించడం బాబీకి అంతో ఇంతో కలిసొచ్చే విషయమే అయినా.. ద్వితీయ విఘ్నాన్ని దాటలేకపోయాడనే మాట మాత్రం పడక తప్పలేదు. దీంతో ఇక బాబీకి స్టార్ హీరోలతో చేసే అవకాశం కష్టమే అనే టాక్ వినిపించింది. అయితే.. బాబీకి తొలి మూవీ 'పవర్' ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో మాస్ మహరాజ్ రవితేజ.. మరో ఛాన్స్ ఇచ్చాడంటున్నారు.

మాస్ మహరాజ్ తో పవర్ చేసి సక్సెస్ కొట్టాడు బాబీ. 'సర్దార్ రిజల్ట్ తో ఏం వర్రీ కావద్దు. మనం కలిసి మరో సినిమా చేద్దాం' అంటూ రవితేజ నుంచి అభయం రావడంతో.. బాబీ కుదుటపడ్డాడని తెలుస్తోంది. మొత్తానికి మూడో సినిమాని కూడా స్టార్ హీరోతోనే చేసే ఛాన్స్ డైరక్టర్ బాబీకి దక్కనుందని సమాచారం.

,  ,  ,  ,  ,  ,