Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Sep-2017 11:38:32
facebook Twitter Googleplus
Photo

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వారసులే తెరపై సందడి చేస్తూ ఉంటారు. ఇప్పటి స్టార్ హీరోల్లో చాలా మంది వారే. మన పరిశ్రమలోనే కాదు.. దేశవ్యాప్తంగా అనేక సినిమా రంగాల్లో ఇదే కల్చర్ కనిపిస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ వారసులందరూ హీరోలు అయిపోలేరు అన్నది జగమెరిగిన సత్యమే. వాళ్లకూ ట్యాలెంట్ ఉండి.. ప్రూవ్ చేసుకుంటే మాత్రమే నిలదొక్కుకోగలుగుతారు.

ఇప్పుడు మరో వారసుడు వచ్చేస్తున్నాడు. అతనెవరో కాదు.. రవితేజ కుమారుడు మహాధన్. ఏంటీ.. రవితేజకు హీరో అయ్యేంతటి కొడుకు ఉన్నాడా అని ఆశ్చర్యం వేయచ్చు. రాబోయే కాలంలో ఈ మహాధన్ హీరో అవచ్చేమో కానీ.. ప్రస్తుతానికి తన తండ్రి పాత్రనే పోషించేస్తున్నాడు. లాంగ్ గ్యాప్ తీసుకుని.. రాజా ది గ్రేట్ అంటూ రవితేజ మూవీ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరో చిన్నప్పటి పాత్ర కూడా కొంతసేపు ఉంటుంది. ఈ రోల్ కోసం చాలామందినే అన్వేషించి.. చివరకు మాస్ మహరాజ్ వారసుడినే తీసుకొచ్చారట. మొదటగా అయితే టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్టులలో ఎవరినైనా తీసుకుందామని భావించినా.. ఆ తర్వాత మాత్రం మహాధన్ వైపే మొగ్గినట్లు తెలుస్తోంది.

రాజా ది గ్రేట్ చిత్రంలో మహాధన్ నటిస్తున్న విషయంపై అనౌన్స్ చేయలేదు. మేకర్స్ ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలని భావించినా.. యూనిట్ నుంచి మాత్రం ఈ అంశం లీక్ అయిపోయింది. తన తండ్రి చిన్నప్పటి వెర్షన్ లోనే నటించే అవకాశం కొద్ది మంది హీరోలకు మాత్రమే వస్తుంది.

,  ,  ,  ,  ,  ,