Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jun-2016 14:08:15
facebook Twitter Googleplus
Photo

మాస్ మహారాజ్ రవితేజ నటించబోయే కొత్త సినిమా ?రాబిన్‍హుడ్? అనౌన్స్ అయి చాలా కాలమే అయినా ఇప్పటికీ ఆ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడు వెళుతుందనే విషయమై క్లారిటీ రాలేదు. ?బెంగాల్ టైగర్‌?తో ఫర్వాలేదనిపించుకున్నా, తన స్థాయి హిట్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తోన్న రవితేజ, కొత్త సినిమాతో ఎలాగైనా మళ్ళీ సాలిడ్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా స్క్రిప్ట్ మీదే చాలాకాలంగా కష్టపడుతూ వస్తున్నారు. చక్రి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ చివరిదశలో ఉంది.
స్క్రిప్ట్ మొత్తం దాదాపుగా పూర్తయిందని, జూలై నెలలో సినిమా సెట్స్‌పైకి వెళ్ళే సూచనలున్నాయని తెలిసింది. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమా రవితేజ మార్క్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా కోసం రవితేజ సిక్స్‌ప్యాక్ లుక్ కూడా ప్రయత్నించడం విశేషంగా చెప్పుకోవచ్చు. రవితేజ సరసన రాశిఖన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నారు.

,  ,  ,  ,  ,  ,