Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Oct-2015 16:26:01
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో అప్ కమింగ్ హీరోగా తనదైన ముద్ర వేస్తున్నాడు సందీప్ కిషన్. మామ ఛోటా.కె తో కలిసి తెలివైన స్ర్కిప్టుల్ని ఎంచుకుంటూ తెలివైన ప్రణాళికలు వేస్తూ ముందుకు వెళుతున్నాడు. సందీప్ కిషన్ ఇప్పటికే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ - టైగర్ లాంటి విజయవంతమైన సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. లేటెస్టుగా ఒక్క అమ్మాయి తప్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు. రాజసింహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సందీప్ రేసుగుర్రం విలన్ రవికిషన్ నే ఢీకొడుతున్నాడు.

రేసుగుర్రం సినిమాలో బన్ని క్యారెక్టర్ - కిక్ శ్యాం క్యారెక్టర్ లతో పోటీ పడుతూ .. రవికిషన్ క్యారెక్టర్ ఉంటుంది. అసలు రవికిషన్ విలనీలో ఎంతో ఎనర్జీ ఉంటుంది. బన్నిని ఢీకొట్టే సిసలైన విలన్ గా కనిపించాడు ఆ చిత్రంలో. ఓ వైపు రేసుగుర్రంలా దూసుకొచ్చే బన్నితో టగ్ ఆఫ్ వార్ నడిపించే బ్యాడ్ విలన్ గా అదరగొట్టేశాడు. ఓ ప్రత్యేకమైన ఆహార్యంతో రేసుగుర్రం సినిమాలో కిక్కు పెంచాడు. అలాంటి విలన్ ని ఇప్పుడు కుర్ర హీరో ఢీకొట్టడం అంటే అంత వీజీ కాదు. అందుకు తగ్గట్టే ఆ సన్నివేశంలో ఎనర్జీ లెవల్స్ ని చూపించాల్సి ఉంటుంది.

రవికిషన్ రేంజు పెద్ద రేంజు.. బన్ని - రవితేజ లాంటి స్టార్లకు ధీటైన విలన్ గా కనిపించాడు .. ఇప్పుడు యంగ్ హీరో సందీప్ తన స్థాయిని మంచి అతడితో కలిసి నటించాల్సి ఉంటుంది. ఢీ అంటే ఢీ అన్నట్టే సీన్స్ లో తెగబడాలి. అప్పుడే జనాల కంటికి ఆనుతుందన్నమాట!

,  ,  ,