Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Sep-2016 11:52:02
facebook Twitter Googleplus
Photo

పది నెలలుగా మాస్ మహరాజ్ రవితేజ ఒక్కటంటే ఒక్క సినిమాని కూడా స్టార్ట్ చేయకుండా పెండింగ్ లో పెట్టాడు. కొన్ని ప్రాజెక్టులు రద్దయిపోయిగా.. కొన్నింటిని వేరే వాళ్లు తన్నుకుపోయారు. ఇందుకు ప్రధాన కారణం.. రవితేజ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ అనే టాక్ గట్టిగానే వినిపించింది.

ఈ మాస్ రాజా ఒక్కో సినిమాకి 7 కోట్లు డిమాండ్ చేస్తుండడంతోనే.. దిల్ రాజు.. కేఎల్ దామోదర ప్రసాద్.. డీవీవీ దానయ్యల ప్రాజెక్టులు ఆగిపోయాయంటారు. ఇలా రద్దు చేసుకునే ముందు.. పారితోషికం విషయంలో కాస్త ఓ మెట్టు దిగాలనే రిక్వెస్టును డిమాండ్ రూపంలోనే రవితేజ చెవిన వేసినా.. మాస్ మహరాజ్ మాత్రం పట్టించుకోలేదట. దాని ప్రభావమే పది నెలలు ఖాళీగా ఉండాల్సి రావడం. ఇప్పటివరకూ రవితేజ నటించిన ఏ హిట్టు సినిమా కూడా 30 కోట్ల మార్కును అందుకోలేదు కాబట్టి.. ఈయనకు 5కోట్ల ఫిగర్ కరెక్ట్ అంటూ ఉంటారు సిని జనాలు.

ఇప్పుడు విక్రమ్ సిరి దర్శకత్వం అరంగేట్రం చేస్తున్న మూవీలో.. రవితేజ పోలీస్ పాత్ర చేయనున్నాడు. ఈ మూవీ కోసం రవితేజ 5 కోట్లు అందుకుంటున్నాడని తెలుస్తోంది. పవర్ డైరెక్టర్ బాబీ తీయనున్న సినిమా కోసం కూడా రవితేజ అందుకుంటున్న రెమ్యూనరేషన్ ఇంతేనని తెలుస్తోంది. మొత్తానికి వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నా.. అన్నీ రవితేజ తగ్గాకే అన్నది టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్.

,  ,  ,  ,  ,  ,  ,