Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Dec-2017 11:01:40
facebook Twitter Googleplus
Photo

విరాట్ - అనుష్క ఎట్టకేలకు ఒకటయ్యారు. ముందుగా అందరు ఇదొక రూమర్ అనుకున్నారు. అయితే చివరికి ఫొటోస్ బయటపడటంతో నమ్మక తప్పలేదు. ప్రస్తుతం వారి పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి ఇద్దరికి అభిమానులు చాలా ఆనందంగా విశేష్ అందిస్తున్నారు. ఇక పెళ్లి అనంతరం మిగతా వేడుకలు చాలానే ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే.

రిసెప్షెన్ అని పార్టీలని చాలా వేడుకలతో కొత్త పెళ్లి జంట చాలా బిజీగా గడపాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వెడ్డింగ్ రిసెప్షెన్ ఇన్విటేషన్ ఒకటి వైరల్ అవుతోంది. అందులో విరాట్ - అనుష్క పేర్లతో పటు వారి తల్లిదండ్రుల పేర్లు కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. డిసెంబర్ 21 గురువారం న్యూ ఢిల్లీ లోని స్టార్ హోటల్ లో రిసెప్షన్ జరగనుందట. ఈ వేడుకలో ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొననున్నారట.

ఇకపోతే ఈ రిసెప్షన్ అనంతరం విరాట్ కోహ్లీ తన సన్నిహిత ఆటగాళ్లను ఇన్వైట్ చేయనున్నాడట. అలాగే విదేశీ ఆటగాళ్లు కూడా కొంతమంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అనుష్క శర్మ కూడా బాలీవుడ్ ప్రముఖ నటీనటులను అలాగే దర్శకనిర్మాతలని స్వాగతించనున్నారు.

,  ,  ,  ,  ,  ,