Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Oct-2016 13:30:54
facebook Twitter Googleplus
Photo

మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్లో కొన్ని నిబంధనలు పెట్టుకున్నట్లున్నాడు. అందులో ముఖ్యంగా హీరోయిన్స్ ను రిపీట్ చేయకూడదు అనుకున్నట్లు ఉన్నాడు. ఇది నిజంగానే నిబంధనా లేకపోతే యాథృచ్చికంగా జరుగుతోందా తెలియదు కాని.. పవన్ మాత్రం ఎన్నడూ ఒకసారి జతకట్టిన హీరోయిన్ తో మరోసారి సినిమాయే చేయలేదు.

కాకపోతే అప్పట్లో తన డైరక్షన్లో రూపొందిన ''జానీ'' సినిమాకు మాత్రం వైఫ్ రేణు దేశాయ్ ను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. తన వైఫ్ కాబట్టే బద్రిలో పనిచేసిన రేణును రెండోసారి పెట్టుకున్నాడు అన్నారందరూ. కాకపోతే తన 20 ఏళ్ల కెరియర్ లో మరోసారి ఆ ఫీట్ చేస్తున్నాడు పవర్ స్టార్. ఈసారి కత్తిలాంటి అందాలతో హొయలొలికించే శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నాడు. సరే ఎప్పటినుండో ఈ న్యూస్ వినిపిస్తున్నదే. కాని ట్విస్ట్ ఏంటంటే.. ఈ బుధవారం నుండి కాటమరాయుడు సినిమా షూటింగులో కూడా జాయినైంది శృతి. అంటే పవన్ 20 ఏళ్ల కెరియర్ రికార్డును ఇక క్రియేట్ చేసినట్లేగా!!

అసలు శృతి హాసన్ ను కూడా మనం అభినందించాల్సిందే. ఎందుకంటే అమ్మడు ఎప్పటినుండో పవన్ కోసం వెయిట్ చేస్తూ చేస్తూ తన డేట్స్ అన్నీ వేస్ట్ చేసుకుంది. కాని వాకౌట్ చేస్తుందేమో అనుకంటే.. అమ్మడు మాత్రం వెయిటింగే చేసింది. చివరకు షూటింగులోకి దూకేసింది. వెల్ డన్ గాళ్.

,  ,  ,  ,  ,  ,