Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Mar-2017 11:24:26
facebook Twitter Googleplus
Photo

బాహుబలి ది కంక్లూజన్ ట్రైలర్ దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించేందుకు రెడీ అయిపోతోంది. ఇప్పటికే దాదాపు 90 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ ట్రైలర్.. త్వరలో 10 కోట్ల మార్క్ ను అధిగమించిన తొలి టాలీవుడ్ ట్రైలర్ గా రికార్డు పుటల్లోకి ఎక్కేయనుంది.

మరోవైపు బాహుబలి2ని గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేసేందుకు దర్శకధీరుడు రాజమౌళి సిద్ధమైపోతున్నాడు. ఈ మూవీ తర్వాత మరో 3-4వారాల వరకూ నాలుగు భాషల్లో వేరే ఏ భారీ చిత్రం రిలీజ్ చేసేందుకే సాహసిచండం లేదంటే.. బాహుబలి హంగామా ఏ స్థాయిలో ఉందో అర్దమవుతుంది. బాహుబలి రెండో భాగాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సీక్వెల్లో ప్రతీ దృశ్యం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాలని అలాగే సినిమాకు మరింత గ్రాండ్ నెస్ పెరగాలనే ఈ భాగాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్లో రిలీజ్ చేస్తున్నాం" అని చెప్పాడు రాజమౌళి.

ఐమ్యాక్స్ వెర్షన్ లో రిలీజ్ చేయడంతో.. తమ భారీ చిత్రానికి మరింత భారీతనం చేకూరుతుందని అన్నాడు జక్కన్న. ఏప్రిల్ 28న తెలుగు.. తమిళ్.. హిందీ.. మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న బాహుబలి ది కంక్లూజన్.. దేశంలో తొలిసారిగా 1000 కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ జనాలు అంచనా వేస్తున్నారు.

,  ,  ,  ,  ,