Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Aug-2016 13:02:19
facebook Twitter Googleplus
Photo

నగరంలోని ఓ మొబైల్ షోరూంలో టాలీవుడ్ నటి రెజీనా కసాండ్ర బుధవారం సందడి చేశారు. ఆత్యాధునిక సాంకేతిక టెక్నాలోజితో ఒప్పో మొబైల్ రూపొందించినట్లు రెజీనా పేర్కొన్నారు. మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో ఆమె బుధవారం ఎఫ్-1 ఫోర్ట్ మొబైల్స్ ప్రారంభించారు. తమ అభిమాన తార వచ్చిందని తెలియగానే చాలా సంఖ్యలో అభిమానులు ఒప్పో స్టోర్ వద్దకు తరలివచ్చారు. రెజీనాను దగ్గరి నుంచి చూసేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు.

ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ 3 జీబీ ర్యామ్ ట్రిపుల్ ప్లాట్ కార్ట్ లాంటి సదుపాయాలు ఈ మొబైల్‌లో ఉన్నాయని ఆమె తెలిపారు. అధిక స్పష్టత ఉండే బ్లూరే వీడియోలు సైతం ఈ మొబైల్స్ లో అద్భుతంగా ప్లే అవుతాయని పేర్కొన్నారు. ఈవెంట్లో భాగంగా ఒప్పో బృందంతో నటి రెజీనా సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒప్పో మొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ జోన్ , ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

,  ,  ,  ,  ,  ,  ,