Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2016 12:33:31
facebook Twitter Googleplus
Photo

గత కొంత కాలంగా టాలీవుడ్ లో ఒక న్యూస్ బాగా చక్కర్లు కొడుతోంది. హిట్లు సాధించినా గుర్తింపు వచ్చినా గ్లామర్ డోస్ పెంచినా.. ఇలా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆఫర్స్ విషయంలో వెనకబడ్డంతో.. రెజీనా కసాండ్రా ఓ ఉచిత ఆఫర్ ను పంపిందనే టాక్ ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కృష్ణవంశీ చేయబోతున్న సినిమాలో.. తనను హీరోయిన్ గా తీసుకుంటే ఉచితంగా నటిస్తాననే ఆఫర్ ఇచ్చినట్లు చెప్పుకున్నారు. ఇప్పుడీ అంశంపై ఓ క్లారిటీ వచ్చింది.

'కృష్ణవంశీ చేయనున్న నక్షత్రం కోసం అమెరికా టూర్ ని మధ్యలోనే బ్రేక్ చేసుకుని రెజీనా హైద్రాబాద్ వచ్చిన మాట వాస్తవమే. అయితే.. ఈ సినిమాకోసం ఆమె ఖచ్చితంగా రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. కృష్ణవంశీలాంటి దర్శకుడి సినిమాలో చేసేందుకు ఏ హీరోయిన్ అయినా ఇంట్రెస్ట్ చూపుతుంది. అలాగే రెజీనా కూడా అవకాశం కూడా ప్రయత్నిచింది. చివరకు రెండు వైపుల నుంచి టెర్మ్స్ కుదరడంతో.. ఈ అవకాశం రెజీనాకు దక్కింది' అని నిర్మాతల వైపు నుంచి ఓ స్పష్టత వచ్చింది.

ప్రస్తుతం కృష్ణవంశీ మూవీతో పాటు.. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందుతున్న జ్యో అచ్యుతానంద లోను రెజీనా యాక్ట్ చేస్తోంది. అయితే.. కృష్ణవంశీ మూవీలో ఉచితంగా చేయకపోయినా.. ఇందులో బికినీ సీన్ కు ఒప్పుకోవడంతోనే.. ఈ ఆఫర్ దక్కిందనే టాక్ ఉంది. మరీ ఫ్రీగా చేసేయకపోయినా.. పారితోషికం విషయంలో బాగానే తగ్గిందని అంటున్నారు సినీజనాలు.

,  ,  ,  ,  ,