Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Apr-2016 12:20:02
facebook Twitter Googleplus
Photo

శిల్పా చక్రవర్తి.. తెలుగులో ఒకప్పుడు ఫేమస్ యాంకర్. సుమ.. ఝాన్సీల తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఈ అమ్మాయి.. మధ్యలో కొన్నేళ్లు కనిపించకుండా పోయింది. బెంగాలీ అమ్మాయి అయినా.. తెలుగు నేర్చుకుని యాంకర్ గా మారి తన ప్రత్యేకతను చాటుకున్న శిల్పా.. సడెన్ గా ఎందుకు మాయమైపోయిందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఈ మధ్య ఉన్నట్లుండి రీఎంట్రీ ఇచ్చి మళ్లీ తనేంటో చూపించడానికి రెడీ అవుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూతో లైమ్ లైట్లోకి వచ్చిన శిల్ప ఈ ఊపులో యాంకర్ గా మళ్లీ పునర్వైభవం అందుకోవడానికి చేయాల్సిందల్లా చేస్తోంది.

నిన్న ఓ ఆడియో ఫంక్షన్ సందర్భంగా శిల్పా చేసిన ఫొటో షూట్ చూస్తే మతిపోవడం ఖాయం. కుర్రాళ్ల మతులు పోగొట్టేలా.. ఈ ఫొటో షూట్లో రెచ్చిపోయిందామె. ట్రెడిషనల్ గా కనిపించే యాంకర్లో ఇంత హాట్ నెస్ ఉందా అని ఆశ్చర్యపోయేలా పోజులిచ్చిందామె. ఒకప్పుడైతే యాంకర్ అంటే పద్ధతిగా ఉండాలి అని ఉండేది. కానీ ఈ తరంలో స్పైస్ లేకుంటే రాణించడం కష్టమని అర్థం చేసుకున్నట్లుంది శిల్పా. అనసూయ.. రష్మి లాంటి యాంకర్లను చూశాక శిల్పలో వచ్చిన మార్పేమో ఇది. మరి ఈ హాట్ ఫోజులు ఆమెకు ఎలాంటి అవకాశాలు తెచ్చిపెడతాయో చూద్దాం.

,  ,  ,  ,  ,