Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2016 10:29:37
facebook Twitter Googleplus
Photo

లైలా ఓ లైలా.. ఈ పదాలు చదువుతున్నపుడే.. సూపర్బ్ సాంగ్ నాలుకపై ఆడ్డం సహజం. అంతగా హిట్ అయిన పాట అది. ఆ పాట పల్లవిని టైటిల్ గా తీసుకోవడం అంటే.. నిజంగా సాహసం చేయడమే అనాలి. పాటల నుంచి సినిమాలో కంటెంట్ వరకూ ఆ రేంజ్ ఎక్స్ పెక్ట్ చేస్తారు ఆడియన్స్. అయితే.. అక్కినేని కుటుంబం ఇప్పుడీ 'లైలా ఓ లైలా' టైటిల్ ని రిజిస్టర్ చేయించడం ఆసక్తిగా మారింది.

అక్కినేని హీరోలు అంటే రొమాంటిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనే మాటను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం నాగ్ ఓం నమో వెంకటేశా అంటూ భక్తి చిత్రం తీస్తున్నారు కాబట్టి.. ఈటైటిల్ నాగార్జునకు కాదు. నాగ్ కుమారుల్లో ఎవరో ఒకరు లైలా ఓ లైలా టైటిల్ పై సినిమా చేయబోతున్నారన్న మాట. ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో - ప్రేమమ్ చిత్రాల్లో నటిస్తున్నాడు నాగచైతన్య. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాను రీసెంట్ గానే స్టార్ట్ చేశాడు. ఇది ఓ రొమాంటిక్ ఎంటర్టెయినర్ అని ఇప్పటికే చెప్పేశారు.

ఊపిరి తర్వాత వంశీ పైడిపల్లి అఖిల్ తో సినిమా చేయనున్నాడు. ఇంకా స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ అవలేదు కానీ.. ఇది కూడా యూత్ లవ్ స్టోరీనే అంటున్నారు. అంటే.. లైలా ఓ లైలా టైటిల్ ఎవరికైనా సూట్ అవుతుందన్న మాట. మరి ఇలాంటి క్రేజీ టైటిల్ పై సినిమా ఎవరు చేస్తున్నారనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

,  ,  ,  ,  ,