Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Nov-2016 10:34:35
facebook Twitter Googleplus
Photo

రెమో ఈ మూవీ తమిళనాడులో ఓ సంచలనం. శివకార్తీకేయన్ కెరీర్ కు న్యూ టర్న్ ఇచ్చిన సినిమా. కీర్తి సురేష్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచిన చిత్రం. అలాగని రెమో కల్ట్ క్లాసిక్ ఏమీ కాదు. ఓ రెగ్యులర్ ఫార్మాట్ లో నడిచే ఫక్తు కమర్షియల్ ఎంటర్ టైనర్. కానీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి విడుదలైన తర్వాత వచ్చిన కలెక్షన్స్ వరకు ప్రతీ స్టేజ్ లోనూ టాక్ ఆఫ్ ద టౌనైంది రెమో. మరి ఏం లేకుండానే ఎందుకంత పబ్లిసిటీ వచ్చిందంటే కారణం ఆ మూవీకి చేసిన ప్రమోషన్సే. అందుకే ఇప్పుడు తెలుగులోనూ అదే స్ట్రాటజీని అప్లై చేస్తోంది రెమో టీమ్.

ఓ మాములు సినిమాకి కరెక్ట్ పబ్లిసిటీ యాడైతే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూపించింది రెమో. హీరో శివకార్తీకేయన్ కి బాగా కావాల్సిన ఆర్ డీ రాజా రెమో మూవీతో ప్రొడ్యూసర్ గా మారాడు. నిర్మాతగా హిట్ కొట్టాలనే టార్గెట్ తో పాటు శివ కార్తీకేయన్ మార్కెట్ ని విపరీతంగా పెంచేయాలనే స్ట్రాటజీతో ముందు నుంచి రెమో మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన 24AM స్టూడియోస్ ప్రమోషన్స్ ని కొత్త పుంతలు తొక్కించి రెమోని బిగ్ వెంచర్ గా మార్చింది. కబాలి.. తెరి తర్వాత థర్డ్ సూపర్ హిట్ ఆఫ్ ద ఇయర్ గా ఉన్న రెమో స్మాల్ హీరోగా ఉన్న శివని టాప్ లోకి తీసుకెళ్లింది. ఇప్పుడు అదే సినిమాని తెలుగులోకి తెస్తున్నారు. దిల్ రాజు రెమో తెలుగు వర్షన్ ని రిలీజ్ చేస్తున్నారు.

దిల్ రాజుది ఎంత లక్కీ హ్యాండైనా.. మూవీని ఇంకెంత గ్రాండ్ గా రిలీజ్ చేసినా ముందు సినిమా జనాల్లోకంటూ వెళ్లాలిగా. అసలే డబ్బింగ్ బొమ్మ.. పైగా హీరోయిన్ కీర్తి కాస్తో కూస్తో తెలుసుకానీ.. హీరో శివతో ఇక్కడి జనాలకి పెద్ద పరిచయం లేదు. అందుకే రెమో ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో చేస్తున్నారు. ఎంతలా అంటే ఓ డైరెక్ట్ మూవీకి ఏ మాత్రం తగ్గకుండా ఇరగదీసేస్తున్నారు పబ్లిసిటీని. ఇప్పటికే హైద్రాబాద్ మల్టీప్లెక్స్ ల్లో పెట్టిన రెమో క్యుపిడ్ స్టాండీస్ ఎట్రాక్ట్ చేస్తున్నాయ్. ఇక రిలీజ్ డేట్ పక్కాగా సెట్ చేసుకొన్న తర్వాత ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్తారట. చూస్తుంటే తెలుగులో పాగా వేయాలన్న శివ అండ్ టీమ్ అన్నీ రకాల వర్కౌట్స్ చేస్తున్నట్టున్నారు. మూవీకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా చాలు శివకార్తీకేయన్ కోరిక రెమో తీర్చేయడం గ్యారంటీ అనుకోవచ్చు.

,  ,  ,  ,  ,