Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Apr-2016 17:08:08
facebook Twitter Googleplus
Photo

మామూలుగా పెళ్ళయ్యిందంటే ఇక హీరోయిన్లు ఇక్కడ కనిపించరు. రోజు పొద్దున్నే లేవడం.. జిమ్మింగులు చేయడం.. ఫిట్నెస్.. బ్యూటి.. సోషలైజింగ్.. ఇలా అన్నేసి విషయాల్లో ఫోకస్ చేయాలి కాబట్టి.. ఎందుకొచ్చిందిలే ఈ గోల అని వారు అనుకోవడం.. అలాగే పెళ్ళయిన హీరోయిన్లు పెద్దగా గ్లామర్ ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేయరు.. వారిని డిమాండూ చేయలేం అని దర్శకులు అనుకోవడంతో.. మ్యారీడ్ హీరోయిన్స్ సింపుల్ గా మాయమైపోతారు.

ఇప్పుడు విషయం ఏంటంటే.. మలయాళ కుట్టీ అమలా పాల్.. తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ను పెళ్ళి చేసుకున్న తరువాత సినిమాలకు స్వస్తీ చెబుతానంటూ అప్పట్లో అధికారికంగా ప్రకటించింది. కాని తరువాత ఎందుకో మనస్సు మార్చుకొని హ్యాపీగా సినిమాలు చేస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన అమ్మడి ఆర్టు సినిమాలు కొన్ని ఫ్లాపైనా కూడా ఇప్పుడు తమిళంలో మలయాళంలో ఈమెకు మరిన్ని ఆఫర్లు బాగానే ఉన్నాయి.

ఇదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు గ్లామర్ స్టార్ గా కూడా నటించడానికి అమల రెడీగానే ఉందట. కాకపోతే రెమ్యూనరేషన్ మాత్రం 80 లక్షలపైనే ఉందని టాక్. ఎవరైనా అంత ఇవ్వడానికి రెడీగా ఉంటే మాత్రం.. అందాల విందు ఇవ్వడానికి అమల కూడా రెడీ.

,  ,  ,  ,